Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లారక్ ద్వీపంపై దాడి, జోర్డాన్ స్థావరాలపై ఇరాన్ ప్రతీకారం

లారక్ ద్వీపంపై దాడి, జోర్డాన్ స్థావరాలపై ఇరాన్ ప్రతీకారం

వార్త 2 weeks ago

Iran US War : హర్మూజ్ జలసంధి సమీపంలోని లారక్ ద్వీపంలో ఉన్న ఇరాన్ (Iran) రాకెట్ లాంచ్ సిస్టమ్స్‌పై అమెరికా బలగాలు అనూహ్య దాడులు జరిపాయి. సీమైన్స్ అమర్చేందుకు ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రయత్నిస్తోందనే సమాచారంతో రెండు రాకెట్ లాంచర్లను అమెరికా ధ్వంసం చేసింది.

ఈ దాడిలో తమ సైనికులు మరణించారని ధ్రువీకరించిన ఇరాన్, కేవలం రెండు గంటల వ్యవధిలోనే అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. జోర్డాన్‌లోని కింగ్ హుస్సేన్, అల్ అజ్రక్ యూఎస్ సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది.

Read also: Nepal Floods : మా దేశానికి అండగా నిలవండి అంటూ మనీషా ఆవేదన

 Iran US War

Iran US War : అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం

ఇరాన్ ప్రయోగించిన 12 క్షిపణుల్లో 8 క్షిపణులను జోర్డాన్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోగా, అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఐఆర్‌జీసీ ప్రకటించింది. అయితే తమకు గణనీయమైన నష్టమేమీ జరగలేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ఆంక్షల ద్వారా ఇరాన్ ఆర్థిక, సైనిక వ్యవస్థలను ఇప్పటికే దెబ్బతీశామని డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్​పై తాము విధించిన ఆంక్షలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఇరాన్ సైనిక సామర్థ్యం,​ ఆర్థిక వ్యవస్థపై​ గట్టి దెబ్బ కొట్టామని చెప్పారు. ఇరాన్​ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు. ఇరాన్​ నాయకత్వం కూడా తీవ్రంగా దెబ్బతిందని, ప్రస్తుతం ఆ దేశం పతనావస్థలో ఉందన్నారు. సరైన సమయం చూసి విజయం సాధిస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఇరాన్ దళాలు గతంలో వేలాది మంది నిరసనకారులను చంపేశాయన్న అంశాన్ని ట్రంప్ లేవనెత్తారు. మూడు నెలల క్రితం వరకు ఇరాన్​ 52,000 మంది నిరసనకారులను చంపారని ఆరోపించారు.

ఒకే కాన్పు..ఇద్దరు పిల్లలు.. తండ్రులు మాత్రం వేరు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha