LPG Price Hike : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులు మరియు సంక్షోభాల వల్లే వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలను పెంచక తప్పలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.
కర్ణాటకలోని ధార్వాడ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా విచారాన్ని, బాధను వ్యక్తంచేస్తోందని అన్నారు. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే ముందు ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ పరిస్థితులను మరియు ఇంధన రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
Read Also: Indi Alliance : నేడు 'ఇండీ' కూటమి భేటీ.. హాజరుకానున్న TVK?
Pralhad Joshi
సుదూర దేశాల నుంచి ఇంధన సేకరణ..
పెరిగిన రవాణా, బీమా ఖర్చులు ప్రస్తుతం ఎల్‌పీజీ లభ్యత చాలా పరిమిత వనరుల నుంచే సాధ్యమవుతోందని కేంద్ర మంత్రి వివరించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం చాలా దూరంలో ఉన్న దేశాల నుంచి కూడా గ్యాస్, ఇంధన సేకరణ చేస్తోందని తెలిపారు. దీనివల్ల రవాణా ఖర్చులు, మూల ధర విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, సుమారు 40-45 రోజుల సుదీర్ఘ రవాణా సమయం కారణంగా బీమా ఖర్చులు కూడా అదనపు భారంగా మారాయని, అందుకే సామాన్యుల పట్ల ఆందోళన ఉన్నప్పటికీ ధరల పెంపు అనివార్యమైందని ఆయన వెల్లడించారు.
LPG Price Hike : మూడు నెలల్లో రెండోసారి పెరిగిన గ్యాస్ ధర
రూ.29 అదనం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాల నేపథ్యంలో గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 29 మేర పెంచింది. గత మూడు నెలల కాలంలో ఎల్‌పీజీ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో పశ్చిమాసియా ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో ఈ ఏడాది మార్చి 7న సిలిండర్‌పై రూ. 60 పెంచారు. తిరిగి జూన్ 7న ధరను పెంచారు. తాజా రేటు పెంపునకు ముందు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి ఎల్‌పీజీ సిలిండర్‌పై సుమారు రూ. 703 నష్టాన్ని చవిచూస్తున్నట్లు అంచనా వేశారు. వంట గ్యాస్ ధరల పెంపును సమర్థించుకుంటూ కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ప్రపంచంలోనే అతి తక్కువ ధర మన దేశంలోనే ఉందని పేర్కొంది. ఇళ్లకు వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేయడానికి ప్రభుత్వానికి రూ.1,600 కు పైగా ఖర్చవుతోందని వెల్లడించింది. హర్మూజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల వల్ల గల్ఫ్ ప్రాంతం నుండి సరఫరా తగ్గిపోవడంతో, సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ ఆధారంగా ఫిబ్రవరి నుంచి గ్యాస్ ప్రామాణిక ధర సుమారు 46 శాతం పెరిగిందని వివరించింది. అయినప్పటికీ పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తక్కువ ధరకే వంట గ్యాస్ లభిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
దళపతి విజయ్ పార్టీలోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన!

