Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దళపతి విజయ్ పార్టీలోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన!

దళపతి విజయ్ పార్టీలోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన!

వార్త 1 week ago

Raghava Lawrence: తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ నటుడి ఎంట్రీపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ కోలీవుడ్ మరియు తమిళనాట రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

దళపతి విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ తరఫున ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారనే వార్త సంచలనంగా మారింది.

Read Also :UPI without internet: ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక టాపిక్ - అసలేం జరుగుతోంది?

 Raghava Lawrence Political Entry Tamilaga Vettri Kazhagam TVK Trichy East

తమిళనాడులోని ‘తిరుచ్చి ఈస్ట్’ (Trichy East) అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగబోయే ఉపఎన్నిక చుట్టూ ఈ రాజకీయ ప్రచారం మొదలైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తరఫున రాఘవ లారెన్స్ ఈ స్థానం నుండి బరిలోకి దిగుతారని, ఇందుకోసం ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమైందని సోషల్ మీడియాతో పాటు తమిళ మీడియా ఛానెళ్లలో కథనాలు వెల్లువెత్తాయి. లారెన్స్ తన ‘మాతృసేవా ఫౌండేషన్’ ద్వారా ఎంతోమంది పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు, విద్యా సాయం అందిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇమేజ్ విజయ్ పార్టీకి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Raghava Lawrence: షూటింగ్‌లో బిజీ.. జూన్ 11న అసలు నిజం

ఈ ప్రచారంపై రాఘవ లారెన్స్ స్వయంగా ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ఊహాగానాలకు మరింత హైప్ ఇచ్చారు. తాను ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సమర్పణలో వస్తున్న హై-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బెంజ్’ (Benz) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు లారెన్స్ తెలిపారు. ఈ షెడ్యూల్ జూన్ 10తో ముగుస్తుందని స్పష్టం చేశారు. “షూటింగ్ పూర్తయిన మరుసటి రోజు, అంటే జూన్ 11 (గురువారం) ఉదయం 9:30 గంటలకు మా అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన, అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తాను” అని లారెన్స్ వెల్లడించారు. లారెన్స్ నిజంగానే విజయ్ పార్టీలో చేరుతారా? లేక తన కొత్త సినిమా ప్రాజెక్ట్ లేదా సేవా సంస్థకు సంబంధించిన ప్రకటన చేస్తారా? అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha