Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న డిజిటల్ డ్రగ్!

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న డిజిటల్ డ్రగ్!

వార్త 2 months ago

Digital drug : టెక్నాలజీ.. మానవ నాగరికతను కొత్త పుంతలు తొక్కించిన అద్భుత ఆయుధం. సమాచార సము ద్రాన్ని అరచేతిలోకి తెచ్చి, అనంతమైన అవకాశాలకు ద్వారాలు తెరిచింది.

ఖండాల మధ్య దూరాన్ని తుడిచివేసి, ప్రపం చాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చిన ఘనత దీనిదే. కానీ, ఇదే సాంకేతికత మానవ మేధస్సును వికసింపజేయాల్సింది పోయి మనిషిని తన గుప్పిట్లోకి తీసుకుంటే? అది అభివృద్ధి కాదు, ఒక అదృశ్య విపత్తుకు సంకేతం (A sign of disaster). నేడు మనం అనుభవిస్తున్న డిజిటల్స్వేచ్ఛ వెనుక ‘వ్యసనం’ అనే భయంక రమైన నీడదాగి ఉంది. ఇటీవల కాలిఫోర్నియా కోర్టుమెటా, యూట్యూబ్ వంటి టెక్ దిగ్గజాలకు 6మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీ సింది. ఇది కేవలం ఒక పరిహారపు తీర్పు మాత్రమే కాదు. లాభాల వేటలో మానసిక ఆరోగ్యాన్ని బలిపీఠం ఎక్కిస్తున్న డిజిటల్ యుగంలో మనిషి తన నియంత్రణను కోల్పోతు న్నాడనే చేదు నిజానికి ఇది ఒక అధికారిక ధ్రువీకరణ. మనం టెక్నాలజీని వాడుతున్నామా? లేక టెక్నాలజీయే మనల్ని వాడుకుంటోందా? అన్న ఒక గంభీరమైన ప్రశ్నను ఈ తీర్పు ప్రపంచం ముందు నిలిపింది.

Read Also : Pre-marital tests: పెళ్లికి ముందు ఈ టెస్టులు తప్పనిసరి!

 Digital drug

Digital drug : డిజిటల్ సైకాలజీ

సోషల్ మీడియా అనేది మొదట్లో సమాచార మార్పిడి వేదికగా ప్రారంభమైం ది. మనుషుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, అభిప్రాయాలను పంచుకోవడం, ప్రపంచ పరిణామాలను వేగంగా తెలుసుకోవడం వంటి ప్రయోజనాలతో అది ప్రజా దరణ పొందింది. కానీ కాలక్రమేణా అది వినోదం, గుర్తింపు, ఆకర్షణ, పోటీ, ప్రభావం వంటి అంశాలను కలిపిన ఒక మానసిక వ్యవస్థగా మారిపోయింది. వినియోగదారుడు యాప్ను ఎంతసేపు ఉపయోగిస్తాడో అదే కంపెనీల లాభా లను నిర్ణయించే ప్రమాణంగా మారడంతో, వినియోగదా రుల దృష్టిని బంధించేలా ప్రత్యేకంగా రూపొందించిన ఆల్గారిథమ్లు సోషల్ మీడియా నిర్మాణంలో కీలక పాత్ర పోషంచాయి. ఇన్ఫినిట్ స్క్రోలింగ్, ఆటోప్లే వీడియోలు, నిరంతర నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు వినియోగదారుడి సౌకర్యం కోసం కాదు, అతడిని యాప్లో ఎక్కువసేపు నిలుపుకోవడానికే రూపుదిద్దుకున్నాయని నిపుణులు చెబు తున్నారు. ఇది సాధారణ అలవాటు కాదని, ఒక రకమైన డిజిటల్ సైకాలజీ అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మన మెదడులో డోపమైన్ విడుదలను ప్రేరేపించే విధంగా రూపొందించిన ఈ డిజైన్ మనలో తక్షణ సంతృప్తి భావనను కలిగిస్తుంది. ఆ సంతృప్తి తాత్కా లికమైనదైనా, దాన్ని మళ్లీ మళ్లీ అనుభవించాలనే కోరిక మనల్ని నిరంతరం స్క్రీన్ ముందు కట్టిపడేస్తుంది. ఇదే ప్రక్రియ ఒక మత్తు పదార్థం పనిచేసే విధానంతో పోల్చ దగినది. అందుకే సోషల్ మీడియాను డిజిటల్ డ్రగ్గా పిలుస్తున్నారు.

మానసిక సమస్యలు

కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఈ వాదనకు న్యాయపరమైన బలం చేకూర్చింది. ఈ పరిణామాల్లో అత్యంత ఆందోళనకరమైన అంశం పిల్లలు, యువతపై పడుతున్న ప్రభావం. చిన్న వయస్సులోనే సోషల్మీడియా వినియోగం ప్రారంభమవడం వల్ల వారి వ్యక్తిత్వ నిర్మాణం సహజ మార్గం నుంచి దారిమళ్లుతోంది. వాస్తవ ప్రపంచం లో ఏర్పడే అనుభవాల స్థానంలో వర్చువల్ ప్రపంచం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందం అంటే ఏమిటి, విజయా న్ని ఎలా నిర్వచించాలి. సంబంధాలను ఎలా అర్థం చేసుకో వాలి వంటి అంశాల్లో సోషల్ మీడియా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతరులతో తమను పోల్చుకోవడం, గుర్తింపు కోసం నిరంతరం ప్రయత్నించడం, లైక్స్, కామెంట్ల ఆధా రంగా తమ విలువను కొలవడం వంటి ధోరణులు యువత లో పెరుగుతున్నాయి. దీని ఫలితంగా ఆందోళన, ఒంటరి తనం, నిరాశ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగు తున్నాయి. ఇప్పటివరకు ఈ పరిస్థితిని వ్యక్తిగత అలవాటు గా మాత్రమే చూశాం. ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వినియోగదారుడి తప్పు అని భావించాం. కానీ కాలిఫోర్ని యా కోర్టు తీర్పు ఆ ఆలోచనను పూర్తిగా మార్చింది. విని యోగదారులు బలహీనతలను గుర్తించి, వారిని ఎక్కువసేపు యాప్లలోనే ఉంచేలా రూపొందించిన వ్యవస్థ కూడా ఒక కారణమని స్పష్టం చేసింది. అంటే ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు.

 Digital drug

సామా జిక సంబంధాలపై ప్రభావం

ఇది వ్యవస్థపరమైన సమస్య. అదృశ్యవిపత్తుకు సంకేతం (A sign of disaster).వినియోగదారుడి మానసిక నిర్మాణాన్ని అర్థం చేసుకుని, దాన్ని వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించడం ఒక నైతిక ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. ఈ తీర్పు సోషల్ మీడియా కంపెనీల బాధ్యతపై ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు నాంది పలికింది. గతంలో పొగాకు కంపెనీలు తమ ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను దాచిపెట్టినట్లు విమర్శలు ఎదుర్కొన్నాయి. అదే విధంగా ఇప్పుడు సోషల్ మీడియా సంస్థలపై కూడా విమ ర్శలు వస్తున్నాయి. వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిసినా, వినియోగాన్ని పెంచే విధంగా ఫీచర్ల ను రూపొందించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ తీర్పు భవిష్యత్తులో మరిన్ని కేసుల కు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. అయితేమొత్తం బాధ్యతను కంపెనీలపై మాత్రమే మోపడంకూడా సరైన పరిష్కారం కాదు. ఇది సమాజంలోని ప్రతి వర్గానికి సం బంధించిన సమస్య. తల్లిదండ్రులు పిల్లల డిజిటల్ విని యోగంపై పర్యవేక్షణ చేయాలి. విద్యాసంస్థలు డిజిటల్ అవగాహనను పాఠ్యాంశంగా చేర్చాలి. ప్రభుత్వాలు వినియో గదారుల రక్షణ కోసం స్పష్టమైన విధానాలను రూపొందిం చాలి. ముఖ్యంగా టెక్ సంస్థలు తమ వ్యాపార నమూనా లను సమాజానికి అనుకూలంగా మార్చుకోవాలి. లాభాల కోసం వినియోగదారుల మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టే విధానం దీర్ఘకాలంలో స్థిరంగా ఉండదు. భారతదేశం వంటి యువ జనాభా అధికంగా ఉన్న దేశాలకు ఈ పరిణామం మరింత ప్రాముఖ్యత కలిగినది. ఇప్పటికే మన దేశంలో చిన్న వయస్సు నుంచే స్మార్ట్ఫోన్ వినియోగం విస్తృతంగా పెరిగింది. రోజుకు గంటల తరబడి సోషల్ మీడియా విని యోగం విద్యార్థులచదువుపై, వ్యక్తిత్వ వికాసంపై, సామా జిక సంబంధాలపై ప్రభావం చూపుతోంది. అయితే ఇప్పటి వరకు దీనిని ఒక వ్యక్తిగత అలవాటుగా మాత్రమే చూసి, ప్రజారోగ్య సమస్యగా పరిగణించలేదు. ఇప్పుడు ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది.

డిజిటల్ యుగానికి హెచ్చరిక

ప్రత్యేకంగా పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ వినియోగంపై అవగాహన కల్పిం చడం అత్యంత అవసరం. పిల్లలకు సోషల్ మీడియా ప్రయోజనాలు మాత్రమే కాకుండా ప్రమాదాల గురించి కూడా తెలి యజేయాలి. అదే సమయంలో ప్రభుత్వం వయస్సు పరి మితులు, డేటా భద్రత, ఆల్గారిథమ్ పారదర్శకత వంటి అంశాలపై కఠినమైన చట్టాలను రూపొందించాల్సిన అవ సరం ఉంది. ప్రపంచంలోని అనేకదేశాలు ఇప్పటికే ఈ దిశ గా చర్యలు ప్రారంభించాయి. భారత్ కూడా ఈఅవకాశాన్ని ఉపయోగించుకుని బాధ్యతాయుతమైన డిజిటల్వి ధానాల ను అమలు చేయాలి. సోషల్ మీడియాను పూర్తిగా నిరాక రించడం సాధ్యం కాదు, అవసరమూ కాదు. అది ఆధునిక జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కానీ దాన్ని నియంత్రణలో ఉంచే సామాజిక బాధ్యతను మాత్రం విస్మ రించలేం. టెక్నాలజీ మనిషి జీవితాన్ని మెరుగుపరచాలిగానీ, మనిషిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి కాదు. ఈ సత్యా న్ని గుర్తించే సమాజమే ఆరోగ్యకరమైన డిజిటల్ సంస్కృతి ని నిర్మించగలదు. కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఒక కేసుకు మాత్రమే సంబంధించినది కాదు. అది డిజిటల్ యుగానికి ఇచ్చిన ఒక హెచ్చరిక. ఇప్పటికైనా మనం జాగ్రత్తపడకపోతే డిజిటల్ డ్రగ్ అనే పదం ఒక ఉపమానం కాదు, ఒక కఠిన వాస్తవంగా మారే ప్రమాదం ఉంది. ఈ హెచ్చరికను సమా జం, ప్రభుత్వం, టెక్ సంస్థలు సమానంగా పరిగణించినప్పు డే భవిష్యత్తు తరాలకుసురక్షితమైన డిజిటల్ ప్రపంచాన్ని అందించగలం. కాలిఫోర్నియా కోర్టు ఇచ్చిన ఈతీర్పు కేవలం ఒక న్యాయపరమైన తీర్పు మాత్రమే కాదు, ఇది డిజిటల్ యుగపు అంతరాత్మకు వినిపించిన హెచ్చరిక. టెక్నాలజీ అనేది మన జీవితాలను సులభతరం చేసే’సాధనం’ కావాలి తప్ప, మన జీవితాలను శాసించే విధంగా ఉండకూడదు.

-మేకల క్రిష్ణ

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తల్లి పక్కనే ఉన్న బిడ్డను బలి తీసుకున్న చిరుతపులి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha