Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుగా పిన్నాపురం

ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుగా పిన్నాపురం

వార్త 1 month ago

ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు

Pinnapuram Greenko Project: ఒక దేశం లేదా ప్రాంతం అభివృద్ధి పూర్తిగా విద్యుత్ పై ఆధారపడి ఉంటుందని కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కేలచంద్ర జోసెఫ్ జార్జ్ పేర్కొన్నారు.

సోమవారం ఓర్వకల్లు మండలం పిన్నా పురంలో గ్రీన్కో సంస్థ ఏర్పాటు చేసిన ఇంటెగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పిన్నాపురం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా నిలుస్తుందని, కర్నూలు జిల్లాకు ఇది ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని తెలిపారు.

Read Also : High Speed Railway Corridor: ఇక హైస్పీడ్ రైల్వే కారిడార్లు!

Pinnapuram Greenko Project: అనుమతుల అడ్డంకులను అధిగమించిన గ్రీన్కో

దేశ అభివృద్ధికి విద్యుత్తు అత్యవసరమని, ఒక విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ శాఖ వంటి అనేక అనుమతులు అవసర మవుతాయని చెప్పారు. ఈ అన్ని అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును నిర్మించిన గ్రీన్కో సంస్థను అభినందించారు. పిన్నాపురం పంప్డ్ స్టోరేజ్ స్టేషన్లను పరిశీలించిన తర్వాత ఇది అత్యుత్తమ ప్రాజెక్టుగా అభివర్ణించారు. కర్ణాటక లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి, ఇతర రాష్ట్రాల సరఫరా ద్వారా ఎటువంటి సమస్యలు లేకుండా అవసరాలు తీర్చుతున్నామని తెలిపారు.

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ప్రాధాన్యత

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కర్ణాటకలో శరావతిలో 125 ఎకరాల్లో 3000 మెగావాట్ల సామర్థంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, ఇది త్వరలో అందు బాటులోకి వస్తుందని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ వనరులైన పవన, సోలార్ విద్యుత్ వాతావరణ పరిస్థితులపై ఆధారపడటంతో నిలిచిపోయే అవకాశ ముందని, అందుకే పంప్డ్ స్టోరేజ్ విధానం అత్యంత కీలకమని వివరించారు.

బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని 30 శాతానికి మించి పెంచకూ డదనే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరి స్తున్నాయని, ఈ నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్ ద్వారా అధిక లోడ్ సమయంలో కూడా విద్యుత్ సమస్యలు ఉండవని తెలిపారు. గ్రీన్కో సంస్థ ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణా టక రాష్ట్రాలలో విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి సహకరిస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో కర్ణాటకకు చెందిన రాజె గౌడ, గౌరవ్ గుప్తా, గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గ్యాస్ వినియోగదారులకు షాక్.. మే 1 నుంచి కొత్త రూల్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha