Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి

వార్త 2 months ago

Pawan Kalyan Tweets: బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్లో శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ 47వ వసంతంలో అడుగిడుతున్న శుభ తరుణాన ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి ఎపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Read also: Pargi News:పరిగి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత: అప్పా జంక్షన్ వద్ద లారీలతో దిగ్బంధం

BJP as the World’s Number One Party: Pawan Praises

Pawan Kalyan Tweets: ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి

దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా బిజెపి ముందుకు వెళ్తందన్నారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ లాంటి మహనీయుల సంకల్పం.. ప్రధాని మోడీ అచంచల విశ్వాసంతో కూడిన పోరాటంతో నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి కీర్తిని ఆర్జించిందని వెల్లడించారు.

ఎన్డీయే ప్రభుత్వం – వికసిత్ సంకల్పం

బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమర్ధవంతమైన విధానాలు అమలు చేస్తూ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిందన్నారు. భారతీయ జనతా పార్టీ వికసిత్ సంకల్పం దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అన్ని వర్గాల సంక్షేమమే బిజెపి లక్ష్యం: ఎంపీ పురందేశ్వరి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha