Pargi News: పరిగి పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్‌ను నిలిపివేసేందుకు పోలీసులు రోడ్డుకు అడ్డంగా భారీ లారీలను ఉంచారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మరియు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వీరిని బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
Read Also:Breaking news: Harish Rao House Arrest: మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్
ఇది రాక్షస పాలన.. రైతుల కోసం పోరాటం ఆగదు: హరీష్ రావు ఫైర్
Obstacles preventing access to farmers-BRS attacks the Revanth government.
అరెస్ట్ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని, కష్టాల్లో ఉన్న రైతులను పలకరించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని ఆయన ఆరోపించారు. “మమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, అడ్డుకున్నా సరే.. భూములు కోల్పోతున్న బాధితుల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
Pargi News: పోలీసుల రాజ్యం నడుస్తోంది.. బిఆర్ఎస్ శ్రేణుల ధర్నా
రాష్ట్రంలో ప్రస్తుతం పోలీసుల రాజ్యం నడుస్తోందని, ప్రజాస్వామ్యబద్ధంగా పర్యటించే హక్కును కూడా కాలరాస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. హరీష్ రావు అరెస్టుకు నిరసనగా అప్పా జంక్షన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై లారీలను అడ్డంగా పెట్టి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం పోలీసుల అత్యుత్సాహమేనని వారు విమర్శించారు. ఈ అరెస్టులతో పరిగి ప్రాంతంలో మరియు అప్పా జంక్షన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

