Bangalore medical college incident: బెంగళూరు శివార్లలోని నెలమంగళ ప్రాంతంలో గల ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రొఫెసర్ మొహమ్మద్, క్లాస్‌రూమ్‌లోనే ఒక విద్యార్థిని పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సదరు ప్రొఫెసర్ క్లాస్ జరుగుతున్న సమయంలోనే అందరి విద్యార్థుల ముందే బాధితురాలికి ప్రేమ ప్రతిపాదన (Propose) చేశాడు. అంతటితో ఆగకుండా, అందరికీ చాక్లెట్లు పంచుతానని చెప్పి వింతగా ప్రవర్తించాడు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, విద్యా మందిరంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం పట్ల తోటి విద్యార్థులు షాక్‌కు గురయ్యారు.
Bangalore medical college incident: నిలదీసిన విద్యార్థిని.. చెప్పుతో దెబ్బ
ప్రొఫెసర్ చర్యతో ఆగ్రహించిన విద్యార్థిని, తనను ఎప్పుడు ప్రపోజ్ చేశావంటూ అందరిముందే నిలదీసింది. అయితే, ఆ ప్రొఫెసర్ ఏ మాత్రం తగ్గకుండా తన దగ్గర సీసీటీవీ ఫుటేజీ ఉందని వాదిస్తూ ఆమెను మరింత ఇబ్బంది పెట్టేలా మాట్లాడాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ యువతి, వెంటనే తన చెప్పు తీసి ప్రొఫెసర్‌ను చితకబాదింది. తోటి విద్యార్థులు ఈ తతంగం మొత్తాన్ని మొబైల్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఏప్రిల్ 1 నుంచి LPG , ATMల నుంచి పాన్ కార్డుల వరకు కీలక మార్పులు

