Dailyhunt
'నాన్-బయోలాజికల్ మ్యాడ్నెస్'.. ప్రధాని తీరుపై కాంతార నటుడు ఫైర్?

'నాన్-బయోలాజికల్ మ్యాడ్నెస్'.. ప్రధాని తీరుపై కాంతార నటుడు ఫైర్?

వార్త 3 weeks ago

Actor Kishore criticizes PM Modi: నటుడు కిషోర్ సామాజిక అంశాలపై తన గళాన్ని విప్పుతూ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలన్న ప్రధాని పిలుపును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

Read Also: LPG fee in restaurants: మీ హోటల్ బిల్లుపై LPG ఫీజు వేస్తున్నారా..?

ఐకమత్యంపై ప్రశ్నలు

గత పదేళ్లలో దేశాన్ని కులమతాల వారీగా విడగొట్టి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కలిసి ఉండాలని అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.దేశాన్ని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులుగా విడగొట్టి ప్రజల మధ్య ద్వేషాన్ని నింపిన తర్వాత, ఇప్పుడు విపత్తులు వస్తున్నాయని అందరినీ ఏకం కావాలని కోరడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.

 Actor Kishore vs PM Modi

నోట్ల రద్దు, రఫేల్ ఒప్పందం, కరోనా లాక్‌డౌన్, అగ్నివీర్, వ్యవసాయ చట్టాల వంటి కీలక నిర్ణయాల సమయంలో ప్రజలను, ప్రతిపక్షాలను కనీసం సంప్రదించారా? అని నిలదీశారు.కరోనా సమయంలో సుమారు 50 లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం వారిని లెక్కలోకి తీసుకోలేదని కిషోర్ మండిపడ్డారు. ప్రజలు గొర్రెల మందలా చావడానికి సిద్ధంగా లేరని హెచ్చరించారు.

అంతర్జాతీయ విధానం

మణిపూర్, కశ్మీర్, లడఖ్ సమస్యలపై ప్రధాని మౌనాన్ని ఆయన తప్పుబట్టారు.యుద్ధ నేరాలకు పాల్పడుతున్న దేశాధినేతలను (ఇజ్రాయెల్) కౌగిలించుకునే ముందు ప్రజల అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తూ, ప్రధాని తీరును 'నాన్-బయోలాజికల్ మ్యాడ్నెస్' (అశాస్త్రీయమైన వెర్రితనం)గా అభివర్ణించారు. దేశ అత్యున్నత పదవికి గౌరవం ఇవ్వలేని వారు ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఇన్ఫోసిస్ నయా రికార్డు.. అమెరికాలో రెండు కంపెనీల కొనుగోలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha