Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రశాంత్ నీల్ బర్త్‌డే.. కన్నడ పదంతో ఎన్టీఆర్ క్రేజీ విషెస్

ప్రశాంత్ నీల్ బర్త్‌డే.. కన్నడ పదంతో ఎన్టీఆర్ క్రేజీ విషెస్

వార్త 1 week ago

Prashanth Neel Birthday: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా విడుదలైన ప్రత్యేక గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు జూన్ 4 దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఎలాంటి అధికారిక సర్ ప్రైజ్ రాకపోయినప్పటికీ.. ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్‌తో ‘డ్రాగన్’ సినిమా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

Read also: Peddi movie review: పెద్ది తో రామ్ చరణ్ రెండేళ్ల కష్టం ఫలించిందా?

 Prashanth Neel’s birthday.. NTR’s crazy wishes with a Kannada word

Prashanth Neel Birthday: ‘డైరెక్టర్ అవారే’ అంటూ తారక్ పోస్ట్

కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన శుభాకాంక్షలు తెలియజేశారు. తారక్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన ప్రత్యేకమైన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ తన ట్వీట్‌లో.. “హ్యాపీ బర్త్‌డే డైరెక్టర్ అవారే (కన్నడలో గారు అని అర్థం). మీరు చెప్పే కథలంత ఘనంగా ఈ సంవత్సరం మీకు గడవాలని కోరుకుంటున్నాను. మన ఇద్దరి కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్ కోసం, మన భవిష్యత్తులో ఏముందో చూడటానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. ప్రశాంత్ నీల్‌ను గౌరవిస్తూ తారక్ కన్నడ పదాన్ని ఉపయోగించడం ఇరు రాష్ట్రాల అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పవర్‌ఫుల్ వర్కింగ్ స్టిల్ విడుదల

ఈ క్రేజీ బర్త్‌డే ట్వీట్‌తో పాటు ప్రశాంత్ నీల్‌కు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ వర్కింగ్ స్టిల్‌ను కూడా ఎన్టీఆర్ పంచుకున్నారు. ఇందులో ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లొకేషన్‌లో మైక్ పట్టుకుని సీరియస్‌గా నడుస్తూ కనిపిస్తున్నారు. ఈ బ్లాక్ అండ్ వైట్ స్టిల్ ‘డ్రాగన్’ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తోందంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంపై తాజా పోస్ట్‌తో అంచనాలు మరింతగా పెరిగాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

'పెద్ది' లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్‌కు పేపర్లు ఎగరేస్తూ సందడి చేసిన ఉపాసన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha