Local Body Elections in AP 2026 : ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఒక సవాలుగా తీసుకోవాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
పులివెందులలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క స్థానంలోనూ అధికార కూటమి ఏకగ్రీవమయ్యేందుకు అవకాశం ఇవ్వకూడదని, ప్రతి పంచాయతీ, వార్డు మరియు మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఖచ్చితంగా బరిలో నిలవాలని ఆదేశించారు. అధికార యంత్రాంగాన్ని లేదా పోలీసులను ఉపయోగించి బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడితే వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించిన జగన్, ఏ నాయకుడు లేదా కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ వారికి పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అధికార పక్షం ఒత్తిళ్లను ధీటుగా ఎదుర్కోవాలని క్యాడర్‌కు జగన్ భరోసా
ఎన్నికల పోరులో వైఎస్సార్‌సీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేకూరిన మేలును విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ నేతలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రజల్లో విశ్వాసాన్ని నింపేలా ప్రచారం నిర్వహించాలని కోరారు. అధికార పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శ్రేణులు సమష్టిగా పోరాడితే స్థానిక పోరులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపవచ్చని వైఎస్ జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
మొగల్తూరు ప్రజావేదికలో ఎమ్మెల్యే పనితీరుపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

