Samantha Ruth Prabhu:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై తరచూ వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా ప్రెగ్నెన్సీ, హాలిడేకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ముఖ్యంగా భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె షేర్ చేసిన హాలిడే ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Read Also: Jailer 2 First Single: ఆగస్టు 21న జైలర్ 2 నుంచి పాట విడుదల
Samantha with pregnancy glow, baby bump
Samantha Ruth Prabhu: హాలిడే పిక్స్.. వైరల్ అయిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్
ఇటీవల సమంత ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని హాలిడే ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫొటోలలో ఆమె ఎంతో ఆనందంగా కనిపిస్తూ ‘జస్ట్ అస్’ అనే క్యాప్షన్‌తో పాటు కొన్ని ఎమోజీలను జోడించారు. ఫ్రెండ్స్, సహచరులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ, పికిల్ బాల్ ఆడుతున్న దృశ్యాలు ఈ పోస్ట్‌లో ఉన్నాయి. సమంత స్నేహితురాలు క్రేషా బజాజ్ “కౌంట్‌డౌన్ మొదలైంది” అని కామెంట్ చేయడంపై అభిమానులు రకరకాల అంచనాలకు వస్తున్నారు.
గతంలో తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ సభలో సమంత మాట్లాడుతూ.. “క్షమించండి, ఇంకో చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ వస్తాను. ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది” అని పేర్కొనడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది. సమంత సినిమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటుండటంతో ఆమె ప్రెగ్నెన్సీ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
Epaper: epaper.vaartha.com

