Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమలు మమితా.. ఆ టాలీవుడ్ హీరోకి వీరాభిమాని..!

ప్రేమలు మమితా.. ఆ టాలీవుడ్ హీరోకి వీరాభిమాని..!

వార్త 2 weeks ago

Mamitha Baiju : మలయాళ బ్యూటీ మమితా బైజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ప్రేమలు' సినిమాతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌లో మమితా (Mamitha Baiju)కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 'ప్రేమలు' సినిమా మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకోవడంతో మమితా బైజుకు టాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి.

తెలుగులో చాలామంది హీరోలు నచ్చుతారని :

'ప్రేమలు'లో తన అందం, నటనతో కుర్రాళ్లను ఆకట్టుకున్న మమితా.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారింది. గత ఏడాది 'డ్యూడ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సూర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సూర్యతో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.

 mamitha baiju

ఇదిలా ఉంటే మమితా బైజుకు టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట. తనకు తెలుగులో చాలామంది హీరోలు నచ్చుతారని చెప్పిన మమితా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే మాత్రం ప్రత్యేకమైన అభిమానం ఉందని వెల్లడించింది. తాను అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానినని చెప్పిన ఈ మలయాళ బ్యూటీ.. ఆయన సినిమాలను ఇష్టంగా చూస్తానని తెలిపింది.

అంతేకాదు, అల్లు అర్జున్ నటించిన సినిమాలను తాను రిపీట్ మోడ్‌లో చూస్తుంటానని మమితా చెప్పడం విశేషం. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పటికే 'ప్రేమలు' సినిమాతో తెలుగు యువతకు దగ్గరైన మమితా.. టాలీవుడ్‌లో తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అని చెప్పడంతో బన్నీ అభిమానులు కూడా ఆమెపై ఆసక్తి చూపిస్తున్నారు. మరి భవిష్యత్తులో మమితా బైజుకు అల్లు అర్జున్‌తో కలిసి నటించే అవకాశం వస్తుందేమో చూడాలి.

ఇదేం స్పీడ్ అనిల్ … !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha