Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమించిన పాపానికి ప్రాణం పోయింది

ప్రేమించిన పాపానికి ప్రాణం పోయింది

వార్త 2 weeks ago

Chilakalguda crime: ప్రేమకు సరిహద్దులు లేవంటారు. కులాలు, మతాలు కూడా లేవంటారు. ఇక ఖండాల సరిహద్దులు అసలే లేవంటూ ఇటీవల పలు జంటలు నిరూపిస్తున్నాయి.

నచ్చిన మనసుతో జీవితాంతం జీవించాలని ఎవరైనా ఆశిస్తారు. ప్రత్యేకించి ఆధునిక కాలంలో కులాలకు, మతాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తమ పిల్లలు నచ్చినవారిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నా పెద్దలు, తల్లిదండ్రులు పెద్దగా అడ్డుచెప్పడం లేదు. కారణం నేటి కాలంలో ప్రేమలు, ప్రేమవివాహాలు సర్వసాధారణంగా మారాయి. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే రెండోవైపు కులాలు, మతాలకు ప్రాధాన్యత ఇస్తూ, ఆ హద్దులను దాడుతున్న తమ పిల్లల్ని చంపుతూ పరువుహత్యలకు పాల్పడుతున్నారు. లేదా ప్రేమించిన వారిని హతమారుస్తున్నారు. తాజాగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడని భావించిన ఆ యువతి కుటుంబ సభ్యులు ప్రియుడిని దారుణంగా హతమార్చిన సంఘటన సికింద్రాబాద్ లో తీవ్ర కలకలం రేపుతున్నది.

Read Also : Mumbai Family Death Case: ముంబై కుటుంబ మరణాల కేసు విచారణలో కీలక విషయాలు

 The young man who loved the young woman…the assailants who killed him

Chilakalguda crime: ప్రాణం తీసిన ప్రేమ

సికింద్రబాద్ లోని చిలకలగూడలో జరిగిన హత్య సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జవహర్ నగర్ కు చెందిన యావన్ (23) బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సీతాఫల్ మండికి చెందిన ఓ యువతిని గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు యావన్ ను హెచ్చరిచారు. అయినా ఆ యువకుడు తరచూ యువతిని కలుస్తున్నాడు. తమ హెచ్చరిక మాటల్ని ఖాతరు చేయకుండా తమ యువతితో మాట్లాడుతున్నాడని ఆగ్రహం చెందారు అమ్మాయి కుటుంబ సభ్యులు. గురువారం రాత్రి గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు మూడు ద్విచక్ర వాహనాలపై యావన్ వద్దకు వచ్చి అతనిపై కత్తులతో దాడి చేశారు. యావన్ వారినుంచి తప్పించుకునేందుకు బయటకు పరుగెత్తినా దుండగులు వదలకుండా విచక్షణారహితంగా కత్తులతో పొడిచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో యువకుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా అపనపటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మృతదేహంతో రోడ్డుపై బైఠాయింపు

కాగా యావన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో తమకు న్యాయం చేయాలని, తమ కుమారుడిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆందోళనకారులు యువతి ఇంటిపై దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితి అదుపు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్‌రే భార్య దారుణ హత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha