UP Meerut Murder: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గురువారం నాడు తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిందన్న కక్షతో, ఒక వ్యక్తి ఆమెను దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు.
ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌కు చెందిన సేమరీన్ అనే యువతి, ఫిరోజ్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల సేమరీన్‌కు కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు. ఈ విషయం తెలిసి ఫిరోజ్ తీవ్ర తీవ్ర ఆగ్రహానికి, అసంతృప్తికి గురయ్యాడు.
Supreme Court: 'అరెస్టు', 'నిర్బంధం', 24 గంటల గడువుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Atrocity by an obsessed lover: Woman murdered for refusing marriage
UP Meerut Murder: చివరిసారిగా మాట్లాడుకుందామని పిలిచి ఘాతుకం
తనను కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడటాన్ని తట్టుకోలేకపోయిన ఫిరోజ్.. సేమరీన్‌ను చివరిసారిగా మాట్లాడుకుందామని నమ్మించి పిలిచాడు. అనంతరం ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ఒక పొలంలోకి తీసుకెళ్లి, పెళ్లి విషయమై తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వివాహానికి ఆమె నిరాకరించడంతో ఆవేశంతో రగిలిపోయి, ఆమె గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు.
ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు ఫిరోజ్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
Epaper: epaper.vaartha.com
భార్యపై అనుమానంతో దారుణం.. కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!

