Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-5తో సీఎం రేవంత్ భేటీ

ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-5తో సీఎం రేవంత్ భేటీ

వార్త 2 weeks ago

Prince Rahim Aga Khan : భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేసిన షియా ఇస్మాయిలీల ప్రస్తుత ఇమామ్ (మతపెద్ద) ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-5తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భేటీ అయ్యారు.

హైదరాబాద్ నగర చారిత్రక వారసత్వ సంపదను కాపాడటం మరియు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది. ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలోని చారిత్రాత్మక నిర్మాణాలైన సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ (Restoration) ప్రాజెక్టులలో భాగస్వామ్యం కావాలని, అందుకు కావలసిన సాంకేతిక, ఆర్థిక సహాయ సహకారాలను అందించాలని అగా ఖాన్ ఫౌండేషన్‌ను సీఎం కోరారు.

ఉస్మానియా భవనం వారసత్వ సంపదగా మార్పు: గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని నగరానికి గర్వకారణమైన ఒక గొప్ప వారసత్వ సంపదగా (Heritage Structure) తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. చారిత్రక కట్టడాల పరిరక్షణలో అగా ఖాన్ ఫౌండేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవం హైదరాబాద్ నగర పునర్నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనితో పాటు, రాబోయే డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘గ్లోబల్ సమ్మిట్’కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు.

మరో 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన కవిత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha