Bengaluru Crime : ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసిన ఓ మహిళ.. తన ఆరేళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసింది. స్వతహాగా లాయర్ కావడంతో కుమార్తె మర్డర్‌ను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది.
కానీ చిన్నారి మరణంపై అనుమానం వచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే ప్రియుడిని అరెస్టు చేయగా.. చిన్నారి తల్లి మాత్రం తప్పించుకుని పారిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దావణగెరెకు చెందిన పి.ప్రియాంక అనే న్యాయవాదికి 2007లో ఉపాధ్యాయుడు ప్రవీణ్ బసప్పతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెళ్ళు. పెద్ద కూతురు (15), వెనిలా(6) సంతానం ఉన్నారు. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుందని అనుకుంటుండగా.. 2025లో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. 2025లో ఫ్యామిలీకి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి బెంగళూరుకు ప్రియాంక వెళ్లింది.
Read Also: DU Professor Murder: మహిళా ప్రొఫెసర్‌ను దారుణంగా చంపిన జంట!
Bengaluru Crime
వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు..సహజీవనం
అక్కడ ఆమెకు తన కాలేజీ స్నేహితుడు జీఎం మోహన్ మళ్లీ కనిపించాడు. ఆ సమయంలో మోహన్ తన బాగోగుల గురించి చెబుతూ.. రియల్ ఎస్టేట్ రంగంలో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించానని తెలిపాడు. అప్పటి నుంచి మోహన్‌తో ప్రియాంక సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను వదిలేసింది. కుమార్తె వెనీలాను తనతో పాటు ప్రియాంక తీసుకెళ్లింది. బెంగళూరులోని సీగెహళ్లిలో అద్దె విల్లాలో నివాసం ఉంటూ మోహన్‌తో సంబంధంలో ఉంది.
Bengaluru Crime : ప్రియాంక పరారీ కాగా.. మోహన్‌ను పోలీసులు అరెస్టు
ఫోన్ చేసి కుమార్తెకు బిర్యానీ, ఐస్‌క్రీం తినిపించామని.. తర్వాత తను నిద్రపోతే కారులోనే ఏసీ ఆన్ చేసి ఉంచి, మోహన్‌తో తాను కాఫీ షాపునకు వెళ్లానని చెప్పింది. తిరిగి వచ్చాక ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టానని.. తెల్లారి ఉదయం వెనీలా లేవకపోవడంతో వైట్‌ఫీల్డ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారని పేర్కొంది. అయితే చిన్నారి మృతిపై తండ్రి ప్రవీణ్ అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదిక కావాలని కోరాడు. ఆ రిపోర్టును ఇంగ్లండ్‌లో చిల్డ్రన్ డాక్టర్‌గా పనిచేస్తున్న సోదరి పూర్ణిమకు పంపించాడు. వెనీలా పోస్టుమార్టం నివేదిక పరిశీలించిన ప్రియాంక.. పలు అనుమానాస్పద అంశాలు ఉన్నాయని గుర్తించింది. దీంతో ప్రవీణ్ కడుగోడి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు జూన్ 4వ తేదీన హత్య కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రియాంక పరారీ కాగా.. మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియాంక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

