Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య భారీ ప్లాన్!

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య భారీ ప్లాన్!

వార్త 2 weeks ago

Khammam Crime: మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఒక సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను రోడ్డు ప్రమాదం సృష్టించి చంపాలని ప్రియుడిపై ఒత్తిడి తెచ్చిన ఒక భార్య దారుణ కుట్ర బయటపడింది.

భార్య ఆమె ప్రియుడికి పంపిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను చూసి భర్త తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.

Read Also :Trainee IPS Uday Krishna: ట్రైనీ ఐపీఎస్‌కు సీపీ సజ్జనార్ షాక్: 5 గంటల పాటు సుదీర్ఘ విచారణ!

ఘటన వివరాలు & హత్యకు పన్నిన కుట్ర

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడుకు చెందిన గాదే రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజేశ్వరరావు ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. భార్య భవాని, కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్న సైదులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గతనెల 27న మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన రాజేశ్వరరావు, వారిద్దరినీ సన్నిహితంగా చూసి నిలదీశాడు. గతనెల 28న చిలుకోడులో పెద్దల సమక్షంలో పంచాయితీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తన అన్నను తీసుకురావడానికి పక్క ఊరికి వెళ్తున్న రాజేశ్వరరావును ప్రియుడు సైదులు వెంబడించాడు. సైదులు నుండి తప్పించుకుని తిరిగి ఇంటికి వచ్చిన రాజేశ్వరరావు, భార్య ఫోన్ చెక్ చేయగా అసలు నిజం బయటపడింది. "యాక్సిడెంట్ చేసి నా భర్తను చంపు.. లేదంటే నేనే చస్తా. ఇంట్లో కాకుండా బయట ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించు" అంటూ ప్రియుడికి భవాని పంపిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌లు లభ్యమయ్యాయి.

Khammam Crime: పోలీసుల విచారణ & కేసు స్థితి

భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆధారాలతో సహా ఈ నెల 1న రాజేశ్వరరావు డోర్నకల్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) నమోదు చేసి కేసును ఖమ్మం రూరల్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, గురువారం రాజేశ్వరరావు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో మరోమారు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందినట్లు, తక్షణమే కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం రూరల్ సీఐ తెలిపారు.

బ్యాంకు క్యూలైన్‌లో నిల్చుని గుండెపోటుతో రైతు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha