Sangareddy Crime: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో ఎలా చిచ్చుపెడుతున్నాయో చెప్పడానికి సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘోర ఘటనే నిదర్శనం. అనుమానం, ఆవేశం వెరసి ఒక ప్రాణాన్ని బలితీసుకోగా, మరో జీవితాన్ని జైలు పాలు చేశాయి.
జహీరాబాద్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడి భార్య మార్చి 30న తన ప్రియుడితో కలిసి కనిపించకుండా పోయింది. దీనిపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఆమె జడ్చర్లలో ప్రియుడితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో భర్తను వెంటబెట్టుకుని వెళ్లిన పోలీసులు, సదరు మహిళను అదుపులోకి తీసుకుని తిరిగి జహీరాబాద్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు.
Read Also: Hyderabad: తారామతి బారాదరిలో 'మోర్ దేన్ ఫ్రెండ్స్' పార్టీపై ఈగల్ పోలీసుల దాడులు
Husband slashes wife’s throat in car after she allegedly went out with boyfriend.
Sangareddy Crime: కారులోనే ఘాతుకం.. గొంతు కోసి హత్య
పోలీసుల సమక్షంలోనే భార్యను కారులో తీసుకువస్తుండగా, మార్గమధ్యలో భర్త తన ఆవేశాన్ని అణచుకోలేకపోయాడు. భార్య ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అతను, ఊహించని విధంగా ఆమెపై దాడి చేసి గొంతు కోశాడు. పోలీసుల కళ్లముందే ఈ దారుణం జరగడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని విధంగా జరిగిన ఈ దారుణ ఘటనకు పోలీసులు సైతం ఖంగు తిన్నారు. కుటుంబ కలహాలు, అనుమానాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ సంఘటన మళ్లీ గుర్తు చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

