Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పృథ్వీరాజ్ కు అన్యాయం?

పృథ్వీరాజ్ కు అన్యాయం?

వార్త 2 weeks ago

72nd National Film Awards : 72వ జాతీయ చలనచిత్ర అవార్డులపై (72nd National Film Awards) సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ, వివాదం నడుస్తోంది.

ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఉత్తమ నటుడి కేటగిరీలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ సినిమా విశ్లేషకులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆడుజీవితం: ది గోట్ లైఫ్’ (The Goat Life) చిత్రంలో ఆయన నటన అత్యంత అద్భుతంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని.. ఇలాంటి అసాధారణమైన, ప్రాణం పెట్టి చేసిన నటనకు జాతీయ అవార్డు రాకపోతే, ఇక ఈ అవార్డుల విలువ ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రంలో నటనకు గాను ఆయన ఇప్పటికే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నప్పటికీ, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించకపోవడం మలయాళ సినీ రంగాన్ని, ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఒక బానిస నరకయాతన.. ఉత్తమ నటుడి అవార్డుపై భిన్నాభిప్రాయాలు ‘ది గోట్ లైఫ్’ చిత్రం కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లిన అతను, అక్కడ ఎడారిలో ఒక బానిసలా మారి ఎలాంటి నరకయాతన అనుభవించాడనేదే ఈ సినిమా కథ. ఈ పాత్ర కోసం పృథ్వీరాజ్ తన బరువును భారీగా తగ్గించుకోవడమే కాకుండా, ఎడారిలో ఒక పశువులా బతికే వ్యక్తి హావభావాలను అద్భుతంగా పండించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే, తాజా జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడి పురస్కారాన్ని మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి (భ్రమయుగం), హిందీ నటుడు కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) సంయుక్తంగా గెలుచుకున్నారు. మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్‌ల నటన కూడా ప్రశంసనీయమైనదే అయినప్పటికీ, పృథ్వీరాజ్ సుకుమారన్ పడిన శ్రమకు, చూపిన నటనకు కనీసం జ్యూరీ ప్రత్యేక అవార్డు (Special Mention) కూడా దక్కకపోవడంపైనే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా 'కమిటీ కుర్రోళ్లు"

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha