Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పులివెందులలో డ్రగ్ నెట్ వర్క్ ఉక్కుపాదం.. 18 మంది అరెస్ట్

పులివెందులలో డ్రగ్ నెట్ వర్క్ ఉక్కుపాదం.. 18 మంది అరెస్ట్

వార్త 2 months ago

15 కిలోల గంజాయి, నాటు సారాయి స్వాధీనం

Drugs Seized Pulivendula: పులివెందుల పట్టణంలో డిఎస్పి మురళి నాయక ఆధ్వర్యంలో పోలీసులు డ్రగ్స్ నెట్వర్క్ పై ఉక్కుపాదం మోపి కీలక నిందితుడి ఆటకు ముగింపు పలికారు.

గంజాయి, నాటు సారాయి అక్రమ రవాణాపై పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. మొత్తం 18 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 15 కిలోల గంజాయి, 110 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్పి నచ్చికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, పులివెందుల డిఎస్పీ బి. మురళి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ దాడులు నిర్వహించింది.

Read Also: Fake CISF Officer Arrested Shamshabad Airport: శంషాబాద్‌లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి గుట్టురట్టు!

 Pulivendula Drug Network Arrest

Drugs Seized Pulivendula: పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ విశ్వనాథ్

మంగళవారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ నందు జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన డ్రగ్స్ ముఠా రట్టు వివరాలు వెల్లడించారు. డిఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. శ్రీరామ్, సబ్ ఇన్స్పెక్టర్లు మధుసూదన్ రెడ్డి, తిమోతి తదితర సిబ్బంది ఖచ్చితమైన సమాచారం మేరకు, పులివెందుల పట్టణంలోని కదిరి రింగ్ రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహించగా, 10 మంది గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడ్డారనీ, వారి వద్ద నుండి 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారనీ అదే సమయంలో మరో ప్రాంతంలో 8 మంది నాటు సారాయి అమ్మకాలు చేస్తుండగా అరెస్ట్ చేసి, 110 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకున్నారన్నారు.

గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.

ఈ గంజాయి నెట్వర్క్ అంత ప్రధాన నిందితుడు గొర్ల భరత్ యాదవ్ ఆధ్వర్యంలోనే జరిగింది. గతంలో హత్య, ఇతర కేసుల్లో భరత్ యాదవ్ రిమాండ్లో ఉండగా జైల్లో పరిచయమైన వ్యక్తులతో కలిసి డ్రగ్ వ్యాపారం ప్రారంభించినట్లు వెల్లడైందన్నారు. రూ.30,000 పెట్టుబడితో గంజాయి కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ అధికారులు గట్టి నిఘా ఉంచి గంజాయి ముఠా గుట్టురట్టు చేసి నిందితులను అరెస్ట్ చేశామని ఈ నిందితులను కోర్టులో హాజరు పరచి రిమాండ్కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మురళి నాయక్, సిఐలు శ్రీరామ్, నరసింహులు, ఎస్ఐ తిమోతి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

వైసీపీ సోషల్ మీడియా నేత పూడి శ్రీహరి అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha