MPTC ZPTC Elections: కడప జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.
పులివెందుల మండలం ఎర్రిపల్లెలోని పోలింగ్ బూత్ వద్ద పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పి, పెట్రోల్ బాంబులు, రాళ్లదాడి వరకు దారితీసింది.
Madanapalle Crime: ఏపీలో సంచలనం.. భూ ఆక్రమణ కేసులో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్!
Tension in Pulivendula; petrol bombs thrown at a polling booth
MPTC ZPTC Elections: ఎర్రిపల్లె వద్ద వైకాపా-టీడీపీ శ్రేణుల ఘర్షణ
ఎర్రిపల్లెలోని పోలింగ్ కేంద్రం వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకుని, పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ప్రారంభమైంది. అదే సమయంలో అక్కడే ఉన్న టీడీపీ శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది.
ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం క్షణాల్లోనే భౌతిక దాడులకు దారితీసింది. ఇరుపక్షాల వారు ఒకరిపై ఒకరు పెట్రోల్ బాంబులు, రాళ్లు విసురుకోవడంతో పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
భారీగా భద్రతా బలగాల మోహరింపు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రిపల్లె ఘటన నేపథ్యంతో జిల్లాలోని ఇతర పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు పటిష్ట నిఘా ఉంచారు.
Epaper: epaper.vaartha.com
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!

