Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శంషాబాద్‌ రోడ్డు ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి

శంషాబాద్‌ రోడ్డు ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి

వార్త 3 weeks ago

Shamshabad Accident: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సిరిసిల్ల ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు బిఆర్ఎస్ నేతలు, వారి కుటుంబ సభ్యులు ఉండటం పార్టీ శ్రేణులను కలచివేసింది.

ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉస్మానియా ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు.

Read Also : అసెంబ్లీకి తాగి వచ్చిన సీఎం భగవంత్ మాన్.?

కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు

ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద మృతదేహాలను చూసి బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తుండగా, కేటీఆర్ వారిని ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఆయన, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పార్టీ తరపున, వ్యక్తిగతంగా ఆ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సత్వర సాయం.. అంబులెన్సుల ఏర్పాటు

మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత, వాటిని స్వగ్రామమైన సిరిసిల్లకు తరలించేందుకు కేటీఆర్ స్వయంగా చొరవ తీసుకున్నారు. మృతదేహాల తరలింపు కోసం రెండు ప్రత్యేక అంబులెన్సులను తన వ్యక్తిగత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. అంత్యక్రియల వరకు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు, పార్టీకి సేవ చేసిన నాయకులు ఇలా రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha