India: ప్రస్తుతం క్రమంగా పెరుగుతున్న డిమాండ్, సరఫరాను దృష్టిలో ఉంచుకుని ధర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది.
ఇప్పటికే డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా రాబోయే రోజుల్లో ఇది మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా అవసరమైన వర్యలను తీసుకోవాలని సోమవారం రాష్ట్రాలకు పంపిన విద్యుత్ విధానంలో సూచించింది.
Read Also:Amanagallu crime:భార్య, కొడుకును చంపి.. కూతురిని ఆసుపత్రి పాలు చేసిన తండ్రి
India: Full thermal power generation
బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుండి ఉత్పత్తి
విద్యుత్ తగినంతగా అందుబాటులో ఉండేలా చూడటానికి, దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుండి ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. తదనుగుణంగా, విసృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ సరఫరా గరిష్ట స్థాయిలో ఉండేలా చూడాలని తెలిపింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కలిగిన సంస్థలకు విద్యుత్ సరఫరా చేసే ధరలను నిర్ణయించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
దిగుమతి చేసుకున్న బొగ్గును ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అయ్యే ప్రస్తుత బొగ్గు ధర, రవాణా, నిర్వహణ ఖర్చులు వంటి వ్యయాలను, అలాగే లాభాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ఆ కమిటీ నిర్ణయించే ప్రామాణిక ధరలు రూపొందించనుందని పేర్కొంది. ఈ విద్యుత్ కేంద్రాలు మొదటిగా ఒప్పందాలు కలిగిన సంస్థలకు విద్యుత్ను సరఫరా చేసిన తదుపరి మిగిలిన మిగులును పవర్ ఎక్సేంజీలో విక్రయిచాల్సి ఉంది. ప్లాంట్ దాని పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా జనరేటర్ నిబంధనల ప్రస్తుత ప్రకారం బొగ్గు నిల్వను నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విజప్తి చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

