Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుట్టినరోజున తిరుమలలో త్రిష.. విజయ్ పార్టీ విజయం కోసమేనా?

పుట్టినరోజున తిరుమలలో త్రిష.. విజయ్ పార్టీ విజయం కోసమేనా?

వార్త 1 month ago

Trisha: నటి త్రిష కృష్ణన్ తన 43వ పుట్టినరోజు మే 4 సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున జరిగిన సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు.

ఏ విధమైన ఆడంబరాలు లేకుండా, సామాన్య భక్తురాలిలా క్యూ లైన్లలో నిలబడి స్వామివారి ఆశీస్సులు పొందడం అందరి దృష్టిని ఆకర్షించింది. తన పుట్టినరోజున దైవ దర్శనం చేసుకోవడం పట్ల త్రిష హర్షం వ్యక్తం చేశారు.

త్రిష తిరుమల పర్యటన కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే కాదని, దీని వెనుక బలమైన రాజకీయ కారణం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విశేషమేమిటంటే, ఆమె పుట్టినరోజు నాడే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. విజయ్ రాజకీయ భవిష్యత్తును తేల్చే ఈ కీలక సమయంలో త్రిష శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also : Trisha Tirumala Visit: త్రిష తిరుమల దర్శనం.. బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్

Trisha: విజయ్ పార్టీ విజయం కోసం మొక్కులు?

నటుడు విజయ్‌కు త్రిష అత్యంత సన్నిహితురాలు అన్న విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోనూ అదే స్థాయి విజయాన్ని అందుకోవాలని, ఆయన పార్టీ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ త్రిష ఈ మొక్కులు చెల్లించుకున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ ఆశించిన రీతిలో రాణిస్తే, త్రిషకు ఇది డబుల్ ధమాకా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అటు తన పుట్టినరోజు సంబరాలు, ఇటు తన ప్రాణస్నేహితుడి రాజకీయ విజయం.. ఈ రెండూ కలిస్తే ఆమెకు ఇది జీవితాంతం గుర్తుండిపోయే పుట్టినరోజుగా మిగిలిపోనుంది. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో త్రిష కోరుకున్నది నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నాడు అన్నగారు.. నేడు దళపతి: దశాబ్దాల తర్వాత రిపీట్ అవుతున్న హిస్టరీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha