Dailyhunt
PV Sindhu: షట్లర్ పీవీ సింధుపై ప్రముఖులు ప్రశంసలు

PV Sindhu: షట్లర్ పీవీ సింధుపై ప్రముఖులు ప్రశంసలు

వార్త 2 months ago

2009లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన సింధు, గత 16 ఏళ్లలో నిలకడైన ప్రదర్శనతో ఈ స్థాయికి చేరుకుంది. ఇందులో ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణం వంటి ప్రతిష్టాత్మక విజయాలు ఉన్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన టాప్-10 క్రీడాకారిణుల జాబితాలో సింధు (PV Sindhu)ఇప్పుడు స్థానం సంపాదించింది.

బ్యాడ్మింటన్ వంటి శారీరక శ్రమతో కూడిన క్రీడలో 500 విజయాలు సాధించడం అనేది ఒక క్రీడాకారిణి ఫిట్‌నెస్, అంకితభావానికి నిదర్శనం. గాయాల బారిన పడినా, ఫామ్ కోల్పోయినా మళ్లీ పుంజుకుంది సింధు. సైనా నెహ్వాల్ తర్వాత భారత బ్యాడ్మింటన్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సింధు, ఈ 500 విజయాల మైలురాయితో తన లెజెండరీ హోదాను మరింత సుస్థిరం చేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

IND vs NZ: ఇవాళే రెండవ T20..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha