Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాబోయే 2 గంటల్లో తెలంగాణలో భారీ వర్షం!

రాబోయే 2 గంటల్లో తెలంగాణలో భారీ వర్షం!

వార్త 2 months ago

Telangana weather update: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు గంటల పాటు వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.

ఈ మేరకు అధికారులు ఆయా జిల్లాల ప్రజలను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

Read Also : TS Inter Supplementary Results 2026: TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026.. విడుదల లైవ్ అప్‌డేట్స్ ఇవే!

 Heavy rain in Telangana in the next 2 hours!

Telangana weather update: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

వాతావరణ కేంద్రం ప్రకారం, ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. రాబోయే రెండు గంటల్లో కింది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • మహబూబ్‌నగర్
  • నారాయణపేట్
  • వనపర్తి
  • జోగులాంబ గద్వాల
  • నాగర్ కర్నూల్
  • నల్గొండ
  • సూర్యాపేట
  • యాదాద్రి భువనగిరి
  • జనగామ

ఆ జిల్లాల్లో మోస్తరు వానలు

భారీ వర్షాలు కురిసే జిల్లాలతో పాటు, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉంది. రాబోయే రెండు గంటల పాటు వర్ష సూచన ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసే వారు వాతావరణ పరిస్థితులను గమనించి బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha