Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాబోయే 48 గంటల్లో ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు

రాబోయే 48 గంటల్లో ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు

వార్త 2 months ago

AP Weather Updates: దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. జూన్ 4వ తేదీన ఇవి కేరళ తీరంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా ధృవీకరించింది.

ప్రస్తుతం ఈ రుతుపవనాల గమనం ఎంతో చురుగ్గా సాగుతోందని, ఈ క్రమంలో శనివారం నుండి సోమవారం మధ్య ఇవి ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 Andhra Pradesh Rains Weather Forecast

Read also: Devineni uma: అమరావతిపై జగన్ కుట్రలు..దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు!

మూడు రోజులు ఆలస్యంగా ఆగమనం

సాధారణ షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే కేరళకు చేరుకోవాల్సిన రుతుపవనాలు, ఈసారి మూడు రోజుల ఆలస్యంగా పలకరించాయి. ఇప్పటికే కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు, గోవాలోని పలు ప్రాంతాలకు ఇవి విస్తరించడంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 6 నుంచి 8వ తేదీల మధ్య ఈ రుతుపవనాలు రాయలసీమ గుండా ఏపీలోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది.

AP Weather Updates: జూన్ 15 నాటికి రాష్ట్రమంతటా విస్తరణ

ఒకవేళ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఏవైనా మార్పులు వస్తే, రుతుపవనాల రాక మరో వారం రోజుల పాటు ఆలస్యమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే, ఈ నెల 10వ తేదీ నాటికి ఇవి ఖచ్చితంగా రాష్ట్రాన్ని తాకుతాయని, జూన్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరిస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ స్పష్టం చేశారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు అదుపులోకి రానున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

పెదపెంకి పనులపై కలెక్టర్ ప్రభాకర రెడ్డి సీరియస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha