Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతిపై జగన్ కుట్రలు..దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు!

అమరావతిపై జగన్ కుట్రలు..దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు!

వార్త 1 week ago

Devineni uma: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులను చూసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాజధాని నిర్మాణాన్ని ఏ రకంగానైనా అడ్డుకోవాలనే కుతంత్రంతో జగన్ సరికొత్త కుట్రలకు తెరతీస్తున్నారని ఆయన ఆరోపించారు.

 Amaravati Capital City Development

Read also: Kakinada ACB Raids: కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.8 కోట్లకు పైగా అక్రమాస్తులు

30 వేల మందితో శరవేగంగా పనులు!

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవినేని ఉమ మాట్లాడారు. “ప్రస్తుతం అమరావతిలో దాదాపు 30 వేల మంది కార్మికులు, ఇంజనీర్లు భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు శ్రమిస్తూ రాజధానిని నిర్మిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రగతిని కళ్లారా చూస్తున్న జగన్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు” అని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాజెక్టుపై ప్రజల్లో భ్రమలు కల్పించేందుకు ప్రతిపక్షం అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

Devineni uma: ఐదేళ్ల విధ్వంసానికి కాలం చెల్లింది

గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాజధాని కోసం కనీసం ఒక్క ఇటుక కూడా వేయకుండా అమరావతిని సర్వనాశనం చేశారని దేవినేని ఉమ దుయ్యబట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో ఐకానిక్ భవనాలు, సీడ్ యాక్సిస్ రోడ్లు, సచివాలయం, హైకోర్టు, హెచ్‌ఓడీ కార్యాలయాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇటీవల జగన్‌ను కలిసిన ఒక వ్యక్తి, కేవలం 24 గంటల్లోనే వాస్తవాలు గ్రహించి తన నిర్ణయాన్ని మార్చుకున్నారని.. రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ప్రస్తావించారు.

2024 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం, అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పనుల వేగం పుంజుకోవడంతో ఏపీ రాజకీయాల్లో రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

విశాఖను 'బే సిటీ'గా మార్చడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha