AP Weather Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుండగానే, మరోవైపు వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ( APSDMA) హెచ్చరించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడటంతో పాటు తేలికపాటి జల్లులు కురిసే వీలుందని అధికారులు వెల్లడించారు.
AP Weather Updates: Thunderstorms and rains in several districts in the next 3 hours!
వర్షంతో పాటు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఉండకూడదని సూచించారు. విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల కింద నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ప్రఖర్ జైన్ కోరారు. ఉరుములు, మెరుపులు మొదలైనప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని, ప్రయాణాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేయాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

