Raghav Juyal Niharika NM: సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న పాపులర్ డాన్సర్, నటుడు రాఘవ్ జుయల్ (Raghav Juyal) మరియు ప్రముఖ నటి, కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎమ్ (Niharika NM) ల తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా, ఒకరినొకరు హగ్ చేసుకుంటూ దిగిన కొన్ని 'కోజీ' (Cosy Photos) ఫోటోలను ఉమ్మడిగా (Joint Instagram Post) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకుండా కేవలం రెడ్ హార్ట్ ఈవిల్ ఐ మరియు స్టార్ . ఎమోజీలను మాత్రమే ఉంచడంతో.. అభిమానుల్లో సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. వీరు తమ ప్రేమబంధాన్ని అధికారికంగా ప్రకటించారా (Relationship Instagram Official)? లేక రాబోయే సినిమా ప్రమోషన్ల కోసం ఈ రేంజ్‌లో హింట్ ఇస్తున్నారా? అనే చర్చ జోరందుకుంది.

లవ్ స్టోరీనా.. లేక 'భాయ్ తేరా స్టార్ హై' సినిమా ప్రమోషనా?
ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కాగానే నెటిజన్లు, అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫోటోలలో నిహారిక రెడ్ స్వెట్‌షర్ట్, రాఘవ్ గ్రే జాకెట్ ధరించి, ఎంతో సహజమైన కెమిస్ట్రీతో కనిపించారు. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి చాలా మంది సెలబ్రిటీలు, ఫ్యాన్స్ వీరికి ముందస్తుగా 'కంగ్రాచ్యులేషన్స్' చెబుతున్నారు. అయితే, సోషల్ మీడియా విశ్లేషకులు మాత్రం ఇదంతా వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'భాయ్ తేరా స్టార్ హై' (Bhai Tera Star Hai) ప్రమోషన్ స్ట్రాటజీలో భాగమేనని గట్టిగా చెప్తున్నారు. ఈ రోజుల్లో సినిమాలపై బజ్ క్రియేట్ చేయడానికి ఇలాంటి లవ్ రూమర్స్ క్రియేట్ చేయడం కామన్ అయిపోయిందని గుర్తు చేస్తున్నారు.
Raghav Juyal Niharika NM: డాన్సర్ నుండి ఆర్యన్ ఖాన్ సినిమా వరకు.. రాఘవ్ క్రేజ్!
మొదట డాన్స్ రియాలిటీ షోల ద్వారా 'కింగ్ ఆఫ్ స్లో మోషన్'గా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్ జుయల్.. ఆ తర్వాత నటుడిగా బాలీవుడ్‌లో స్థిరపడ్డారు. ఏబీసీడీ 2', 'స్ట్రీట్ డాన్సర్ 3డీ', సల్మాన్ ఖాన్ 'కిసి కా భాయ్ కిసి కి జాన్' చిత్రాలలో నటించినప్పటికీ.. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన 'ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' (The Bads of Bollywood) లో రాఘవ్ పోషించిన 'పర్వైజ్' పాత్ర ఆయనకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది. రాఘవ్ జుయల్ డైరీ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'కింగ్' (King) లో నటిస్తుండటంతో పాటు, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రంలోనూ ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

