Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్ కామెంట్స్ పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సెటైర్లు

రాహుల్ కామెంట్స్ పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సెటైర్లు

వార్త 1 week ago

Rahul : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని (ఫారిన్ పాలసీ) ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇతర దేశాల నాయకులను కావలించుకోవడమే (హగ్ చేసుకోవడమే) ప్రధాని మోదీ విదేశాంగ విధానమంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సంస్కారహీనమైన భాషను ఉపయోగిస్తున్నారని, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం శోచనీయమని మండిపడ్డారు. దేశాన్ని నడిపించడానికి ఎంతో మెచ్యూరిటీ (పరిణతి) కలిగిన నాయకత్వం అవసరమని, రాహుల్ గాంధీకి ఆ పరిణతి ఎప్పుడు వస్తుందో చెప్పాలని ఎద్దేవా చేశారు.

 Rahul Gandhi

‘స్టూపిడిటీ, ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు’: జోషి తీవ్ర విమర్శలు

రాహుల్ గాంధీ వినియోగిస్తున్న పదజాలం మరియు ఆయన రాజకీయ శైలిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలు ఆయనలో పెరుగుతున్న నిరాశ నిస్పృహలను (ఫ్రస్ట్రేషన్), అజ్ఞానాన్ని (స్టుపిడిటీ) ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాల్సింది పోయి, చౌకబారు రాజకీయ వ్యాఖ్యలకు దిగజారడం సరికాదని హితవు పలికారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై బలమైన శక్తిగా ఎదుగుతుంటే, దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

దేశ విభజన.. బాధితులను స్మరించిన మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha