Rahul : అమెరికా ప్రతినిధి మార్కో రూబియోతో ముంబైలో జరగనున్న సమావేశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.
జైశంకర్ అత్యంత తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘రూబియో తన ఉద్యోగిని ముంబైకి పిలిపించుకున్నారు’ అంటూ రాహుల్ గాంధీ విమర్శించడంపై జైశంకర్ విస్మయం వ్యక్తం చేశారు. విదేశీ నేతలతో మాట్లాడేందుకు రాజధాని ఢిల్లీ దాటి వేరే నగరానికి వెళ్లడాన్ని పిలిపించుకోవడంగా లేదా ఆదేశించడంగా ఎలా భావిస్తారని ఆయన ప్రశ్నించారు. దేశ ఆర్థిక రాజధాని, వ్యాపార కేంద్రమైన ముంబైలో విదేశీ ప్రతినిధులతో భేటీ కావడం దౌత్యపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయమని, దీనిపై ప్రతిపక్షాలు అర్థం లేని రాజకీయాలు చేయడం తగదని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హయాం నాటి చరిత్రను ప్రస్తావిస్తూ జైశంకర్ ప్రశ్నలు
ఈ సందర్భంగా గతాన్ని గుర్తుచేసిన జైశంకర్, కాంగ్రెస్ నాయకుల వైఖరిలోని ద్వంద్వ నీతిని ఎండగట్టారు. 1972 నాటి చారిత్రాత్మక సిమ్లా ఒప్పందం కోసం నాటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికార్ అలీ భుట్టోను కలవడానికి సిమ్లా వెళ్లారని, అలాగే 2013లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న సల్మాన్ ఖుర్షీద్ పాక్ ప్రధాని పర్వేజ్ అష్రఫ్‌ను కలవడానికి జైపూర్ వెళ్లారని ఆయన గుర్తుచేశారు. “మరి ఆనాడు వారిని విదేశీ నేతలు పిలిపించుకున్నట్లేనా?” అని జైశంకర్ ప్రశ్నించారు. దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక చర్చలు కేవలం దేశ రాజధానికే పరిమితం కావని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్వహించే భేటీలను రాజకీయం చేయడం సముచితం కాదని తేల్చిచెప్పారు.
కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి

