Amaravati: రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనాలు దాదాపుగా పూర్తయ్యాయని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు.
అధికారులు, మంత్రుల నివాస భవన నిర్మాణాలు తుది దశలో ఉన్నాయన్నారు. వారం రోజుల్లో ఎమ్మెల్యే, 20 రోజుల్లో ఎమ్మెల్సీ భవనాలు సాధారణ పరిపాలన (జీఏడీ) శాఖకి అప్పగిస్తామని వివరించారు. ఈ భవనాలకు సంబంధించిన మిగిలిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 టవర్ల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయన్నారు. రైతుల్లో 98.6 శాతం మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని పేర్కొన్నారు. మంగళవారం రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు.
Read also: AP High Court Chief Justice Lisa Gill: ఏపీ హైకోర్టు సీజేకు 'జడ్ ప్లస్' భద్రత!
MLA MLC Quarters Construction Amaravati
Amaravati: అత్యాధునిక సౌకర్యాలతో రాజధాని భవనాలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలిం చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు వివాదాల కారణంగా కొన్ని ప్లాట్లు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 2027 ఆగస్ట్ నాటికి ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. అమరావతి రాజధాని అభివృద్ధి పనుల్లో కీలక పురోగతి సాధించినట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగవంతం చేసినట్లు మంత్రి నారాయణ వివరించారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల గురించి పక్క రాష్ట్రాల్లో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారని అన్నారు.
రైతుల సమస్యల పరిష్కారం పై దృష్టి
30,753 మంది రైతులు 35,017 ఎకరాలు రాజధాని కి భూములు ఇచ్చారని, 34,525 ఎకరాలకు ప్లాట్లు ఇచ్చామని తెలిపారు. 674 మంది రైతులకు మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్చి ఉందన్నారు. కొంతమంది రైతులు కోర్టులకు వెళ్లడం, కుటుంబ వివాదాల కారణంగా ప్లాట్లు కేటాయింపు జరగలేదని, కావాలని కొంతమంది అమరావతి పై రాజకీయ కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. 98.06 రైతులకు ప్లాట్లు కేటాయించామన్నారు. భూములిచ్చినా ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదని ప్రచారం చేసే వాళ్ళు నిజాలు తెలుసుకోవాలన్నారు. లాటరి ద్వారానే ప్లాట్ల కేటాయింపు జరిగిందన్నారు.
పూర్తయిన భవనాలను సాధారణ పరిపాలనా శాఖ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్) కు అప్పజెపుతామని వివరించారు. అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం మొత్తం 12 టవర్లలో 288 ఆధునిక ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. వీటిని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. క్లబ్ హౌస్, ఆసుపత్రి, స్విమ్మింగ్ పూల్, భద్రతా వ్యవస్థలు, సౌరశక్తి వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి వంటి సదుపాయాలు కల్పించనున్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం దాదాపు రూ.524.70 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని మంత్రి నారాయణ వివరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

