‘DGP’ posts: పోస్ట్స్ ఏపార్టీ చూసినా ఏమున్నది గర్వ కారణం, రాష్ట్ర డిజిపి నియామకంలో చెప్పిన పనులు తూచా తప్పకుండా చేసే సీనియర్ లేదా జూనియర్ ఐపీఎస్ అధికారిని డీజీపీగా నియమించి రాష్ట్ర పోలీస్ యం త్రాంగం పగ్గాలు అప్పగిస్తున్నారు.
నీతి నిజాయతీగా, ముక్కు సూటిగా పయనిస్తూ, నియమ నిబంధనలను కఠినంగా అమలు చేసే ఐపీఎస్ అధికారులను రాష్ట్ర పోలీస్ చీఫ్ (డీజీపీ) ఎంపిక దరిదాపులోకి రాకుండా చేస్తున్నారు. ఆపదవి కోసం కొందరు ఐపీఎస్లు విధులు చేపట్టే ముందు చేసిన ప్రమాణాలన్నిటిని మూటకట్టి మూలకు పడేసి, ఖాకీ దుస్తుల విలువలను నేలరాసి ఖద్దర్లకు జీ హుజూర్ అంటూ వంగి వంగి దండాలు పెడుతూ వారి పంచన చేరుతున్నారు. గత కొన్నేళ్లుగా విడిపోకముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రం, ఆ తరువాత విడిపోయిన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న తంతు ఇదే. అధికార పార్టీ కి అనుకూలంగా ఉన్న జూనియర్ ఐపీఎస్ అధికారులను అందలం ఎక్కించడానికి సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కనబెట్టి చిన్నచూపు చూస్తున్నారు.
Read Also : Lockup Death : అసుర చర్యకు అసలు దండన
‘DGP’ posts
‘DGP’ posts: అధికార పార్టీకి అనుకూలంగా
డీజీపీ రేసులో ఉన్న ఐపీఎస్ అధికారులు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చీఫ్ పదవి దక్కించుకోవడానికి రాష్ట్ర, కేంద్రంలోని ముఖ్యమైన ప్రజా ప్రతినిధులు, నాయకులు ద్వారా పెద్ద ఎత్తున పైరవీలు చేయిస్తున్నారనే అపప్రధ ఉండనే ఉంది. న్యాయంగా తమకే డిజిపి పదవి దక్కాలి అని సీనియర్ ఐపీఎస్లు పేర్కొంటుంటే, మాకు డిజిపి హోదా ఇచ్చారు మేము కూడా ఆ పదవికి అర్హత సంపాదించాం కావున మాకే ఇవ్వాలంటూ జూనియర్ ఐపీఎస్లు వాదనలకు దిగుతున్నారు. యూపీ ఎస్సీ ఎంపిక చేసి పంపిన డీజీపీల పేర్ల జాబితాలో నుంచి ఆయా ప్రభుత్వాలు నియమించే డీజీపీ రెండేళ్లపాటు సర్వీ సులో ఉండి పూర్తి స్థాయి బాధ్యతలను నిర్వహిస్తారు. ఒక వేళ యూపీఎస్సీ ద్వారా కాకుండా ప్రభుత్వాలు స్వయంగా నియమించే డీజీపీలను టెంపరరీ డీజీపీలుగా పరిగణించ కుండా వారిని అదనపు బాధ్యతలు చేపట్టే డీజీపీలుగా పెర్కొనాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి రాష్ట్రాల ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. జూనియర్ ఐపీఎస్ ను డీజీపీగా నియమిస్తే వెంటనే సీని యర్ ఐపీఎస్లు తమకు అన్యాయం జరిగిదంటూ కోర్టుల ను ఆశ్రయించిన సందర్భాలున్నాయి. యూపీఎస్సీ ఎంపిక చేసి పంపిన ముగ్గురు ఐపీఎస్ ల జాబితాలో నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారికీ సంబంధించిన ఐపీఎస్ ను పూర్తిస్థాయి డీజీపీగా నియమించుకొంటున్నారు.
అదనపు బాధ్యత
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్(2014) తెలుగు దేశం అధికారంలోకి రాగానే అప్పుడు యూపీఎస్సీ ఎంపిక చేసిన జాబితాలో నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ వి. రాముడికి డీజీపీ పగ్గాలను అప్పగించారు. రాముడు పదవీ విరమణ చేసిన తరువాత డిజిపిలుగా నియమించిన నంద్యాల సాంబశివరావు, ఎం. మాలకొండయ్య, ఆర్.పీ.ఠాకూర్ డిజిపిలు గా అదనపు బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసారు. అప్పట్లో యూపీఎస్సీ ఎంపిక వ్యవహారం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తరువాత (2019) అధికారం లోకి వైసీపీ హయాంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయి డీజీపీగా యూపీఎస్సీ జాబితా లో నుంచి ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గౌతమ్ సవాంగ్ పేరును ఖరారు చేశారు. ఆ తరువాత చోటు చేసు కొన్న తీవ్ర పరిణామాల రీత్యా రెండున్నర సంవత్సరాల సర్వీస్ తర్వాత గౌతం సవాంగ్ను ఆకస్మికంగా తప్పించారు. ఆ తరువాత కే.సీ. రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియ మించి అదనపు బాధ్యతలను అప్పగించారు. పదకొండు మంది సీనియర్లను కాదని రాజేంద్రనాథ్ రెడ్డిని నియ మించడం గమనార్హం. అప్పుడు పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక కోసం యూపీఎస్సీ దృష్టికి తీసుకెళ్ల లేదు.
ప్రభుత్వానికి, పార్టీకి అండగా
2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో హరీష్ కుమార్ గుప్తాకు (మే 2024 జూన్ 2024 వరకు) డీజీపీ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి (టీడీపీ, బీజేపీ,జనసేన) అధికారంలోకి వచ్చింది. ఎన్నికల కోడ్ను తొలగిం చిన తరువాత కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సి.హెచ్. ద్వారకా తిరుమలరావుకు డీజేపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరుమలరావు పదవీ విరమణ చేయగానే యూపీఎస్సీ పంపిన జాబితాలలో నుంచి హరీష్ కుమార్ గుప్తా పేరును ఎంపిక చేసి పూర్తి స్థాయి డీజీపీగా నియమించారు. 1992 బ్యాచుకు చెందిన గుప్తా రెండేళ్లు (2027 జులై నెలవరకు) డీజీపీగా కొనసాగు తారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టి ఆర్ఎస్(ఇప్పుడు బిఆర్ఎస్) అధికారంలోకి రాగానే ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉండే అనురాగ్ శర్మను తొలిసారిగా పూర్తి స్థాయి డీజీపీగా నియమించింది. యూపీఎస్సీ జాబితాలో శర్మ పేరు ఉండటం, ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఆ పేర్లను ఖరారు చేశారు. అనురాగ్ శర్మ పదవీ విరమణ చేయగానే, యూపీఎస్సీ పంపిన జాబితాలోని మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఓకే చేశారు. మహేందర్ రెడ్డి పదవీ విరమణ తరువాత అంజనీ కుమార్ను డీజీపీగా నియమిస్తూ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ పదవిలో ఉన్నారు. అప్పుడు యూపీఎస్సీ ఎంపిక వ్యవహారం గురించే పట్టించు కోలేదు.
‘DGP’ posts
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు
2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర డీజేపీగా రవి గుప్తాను నియమించి, అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రధాన ఇంటలిజెన్స్ చీఫ్గా తిరిగి శివధర్ రెడ్డిని నియమిం చింది. డీజీపీ రవిగుప్తాను బదిలీ చేసి ఆయన స్థానంలో డీజీపీగా జితేంద్రను నియమించి అదనపు బాధ్యతలను అప్పగించారు. జితేంద్ర పదవీ విరమణతో 2025 సెప్టెం బర్ నెలలో బి. శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆయనను డీజీపీగా నియమించడంపై కొంత మంది సీనియర్లు వారి అనుయా యులకు చెప్పి కోర్టులో నియామకం చెల్లదని కేసు వేయిం చారు. కోర్టు కేసు పూర్వపరాలను పరిశీలించిన తరువాత డీజీపీ నియామకాన్ని కొనసాగిస్తూ, యూపీఎస్సీ ద్వారా పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చెయ్యాలని, సుప్రీం కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం యూపీఎస్సీకి లిస్ట్ పంపడం అక్కడనుంచి కొన్నిపాలున్నాయి అంటూతిరిగి పంపడం, మళ్ళీ లోపాలు సరిచేసి ప్రభుత్వం పంపడం, తిరిగి యూపీఎస్సీ కొన్ని తప్పులున్నాయి సరి చేసి పంపమని ఆదేశించారు. పలుమార్లు ఈ తతంగం జరిగిన తరువాత ఆ జాబితా అక్కడ్నించి కదల్లేదు. తాజాగా గత మార్చి నెలలో తెలంగాణా ప్రభుత్వం డీజీపీ పోస్టుకు ప్రతిపాదిత పేర్లతో ఉన్న లిస్ట్ను యూపీఎస్సీకి పంపారు. ఈసారి ఎంపిక జాబితాలో ముగ్గురు పేర్లను యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఏప్రిల్ 30వ తేదీన బి. శివధర్ రెడ్డి పదవీ విర మణ చేస్తున్నారు. యూపీఎస్సీ ఎంపిక చేసి పంపిన డీజీపీ జాబితాలో 1991 బ్యాచ్కు చెందిన సి. వి. ఆనంద్ 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఉన్నారు వీరిలో వినాయక్ ప్రభాకర్కేంద్రంలో డెప్యూటేషన్ పై ఉన్నారు. ఆయన డీజీపీ పదవి పట్ల విముఖంగా ఉన్నా రని చెప్పుకొంటున్నారు. రేసులో ఆనంద్, సౌమ్య మిశ్రా ఉన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర డీజీపీగా ఎవరిని నియమిస్తారో వేచి చూడాలి.
-ఎం. నారాయణ స్వామి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

