Dailyhunt
అసుర చర్యకు అసలు దండన

అసుర చర్యకు అసలు దండన

వార్త 2 weeks ago

Lockup Death : శాంతి భద్రతలు కాపాడాల్సిన వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అతిగా వ్యవహ రిస్తే ఏమవుతుందో తెలిస్తే మరో చోట ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు.

దేశ న్యాయ చరిత్రలోనే లాకప్టెత్లో ఎంతో మంది పోలీసులకు మూకుమ్మడి మరణ శిక్ష విధించిన ఉదంతం వినగానే సభ్య సమాజం నివ్వెరపోతోంది. తమిళనాడులోని తండ్రీ కుమారుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆ తండ్రీ కొడుకులకు ఎలాం టి నేరచరిత్ర లేదు. ‘కోవిడ్’ రోజుల్లో లాక్డౌన్ నిబంధ నలు ఉల్లంఘించి ఎక్కువ సమయం తమ షాపునుతెరచి ఉంచడమే వారి నేరం. అతి స్వల్పకారణంతో తండ్రీకొడుకుల అంతిమ యాత్రకు ఏర్పాటు చేసిన పోలీసులు శిక్షార్హులే. పోలీసుల్లో అసుర మనస్తత్వం గూడుకట్టు కున్న సందర్భాల్లో పేట్రేగిపోయి ‘లాకప్ డెత్’లకు కారకు లవుతారు. అందుకే దేశంలో ‘లాకప్ డెత్’లు కొత్తేమీ కావు. కానీ శిక్షలు పడిన ఉదంతాలు బహు అరుదు. అలాంటి కేసుల్లో చివరాఖరికి వచ్చే తీర్పుల్లో పోలీసు లకు శిక్ష పడిందంటే కేసు ప్రక్రియను నడిపించడంలో న్యాయవ్యవస్థ ప్రశంసనీయ వైఖరిని అభినందించాల్సిందే.

Read Also : Nampally case update: HRC వద్ద ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమా?

 Lockup Death

Lockup Death : మరణశిక్షే సరైన శిక్షా

ఈ కేసులో అదేశాఖలో పనిచేస్తూ, ఉన్నతాధికారులు ఒత్తిడిలు తట్టుకొని కూడా ఆ రోజు జరిగిందేమిటో పూస గుచ్చినట్లు వివరించిన కానిస్టేబుల్ రేవతిని అభినందించా లి. నాలుగుగోడల మధ్య అదీ పోలీసు స్టేషన్ లాకల్గది లో హింసకు గురయినప్పుడే ఇలాంటి లాకప్మ రణాలు సంభవిస్తాయి. అక్కడ జరిగిన ఆకృత్యాలకు సాక్షులెవరూ ఉండరు. ఇలాంటి కేసుల్లో జనమే ఎదురు తిరిగినప్పుడు మాత్రమే అవి కేసుల వరకువెళ్తాయి. దేశంలో లాకప్ డెత్ లు జరిగిన సందర్భాల్లో సంబంధిత పోలీసు స్టేషన్లో తమంత తాముగా సుమోటో కేసులు పెట్టే పరిస్థితి ఉండదు. ఒకవేళ బయటి వారో ఆత్మీయులో పాథమిక సమాచార నివేదిక ఇచ్చినా దానిని కేసు కట్టడంలో పోలీ సుల్నించి ఎంత ప్రతిఘటన ఎదురౌతుందో సాక్ష్యాలను సేకరించడంలోనూ, సాక్ష్యులను సమీకరించడంలో పోలీ సుల వైపు నుండి ఎలాంటి సహాయమూ లభించదు. అందుచేత ‘లాకప్ డెత్’ కేసుల్లో నిరూపణ దుస్సాధ్యమ వుతుంది. ఈ కేసులో హైకోర్టు పోలీసు స్టేషన్ను స్వాధీనపరచుకుని విచారణ ప్రారంభించినా సిబ్బంది సహక రించలేదు. వారు బెదిరించారని జడ్జి పేర్కొన్నారు. ‘దోషులకు జీవిత ఖైదు భయాన్ని కల్పించదు. వారికి మరణశిక్షే సరైన శిక్షాయని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారంటే పోలీసులు ఆ తండ్రీకొడుకులపై ఎంత అమానవీయంగా వ్యవహరించారో తెలుస్తుంది.

వాదిం చడం హాస్యాస్పదం

2020 జూన్ 19న తూత్తుకుడి జిల్లా సాతానుకుళం పోలీసులు షాపు నిర్వాహకులు తండ్రికుమారుడిని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి వారిని తీవ్రంగా కొట్టిహింసించారు. ఈ కేసులో 10మంది పోలీసులపై కేసు నమోదు చేసి అప్పటికప్పుడే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. స్టేషన్ లాకప్ గదిలో ఉన్న షాపు యజమానులైన తండ్రి జయరాజ్, కుమారుడు బెన్నికలను జూన్ 22-23 వరకు నిరంతరం పదేపదే చేసిన దాడివల్లే ‘అసాధారణ గాయాలయ్యాయి. పైగా వారిద్దరూ తమకు తామే గాయపరచుకుని తమపై నిందారోపణలు చేస్తున్నారని పోలీసులు కోర్టులో వాదిం చడం హాస్యాస్పదంగా ఉంది. ఈ కేసులో సుదీర్ఘమైన దర్యాప్తులు కొనసాగడానికి కారణం కేవలం ప్రజాందోళనయే. ఈకేసు బయటికి రాకుండా పోలీసులు యంత్రాం గం చేసిన ప్రయత్నాలు ఇన్నీ అన్నీకావు. తొలుత వీరిద్ద రూ మరణించడానికి కారణం పోలీసులు దారుణంగా హింసించడమేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిం ది. తొలుత మద్రాసు హైకోర్టు మధురై బెంచి సుమోటో గా విచారణ చేపట్టి ఆ ఇద్దరి మరణానికి పోలీసు అధికా రుల దాష్టీకమే కారణమని, పోలీసులు చేసిన ఘాతుకానికి తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది.

 Lockup Death

మానవత్వం లేకపోవడం దురదృష్టకరం

నిందిత పోలీసులు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నం దున దర్యాప్తులో సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉం డేందుకు పారదర్శక దర్యాప్తు, విచారణ కోసం హైకోర్టు సిఐడికి అప్పగించగా జనంలో చులకన కాకుండా ఉం డేందుకు ఆ రాష్ట్రప్రభుత్వం సిఐడి నుంచి సిబిఐకి అప్ప గించింది. హత్య, అక్రమ నిర్బంధం, తప్పుడు సాక్ష్యాల సృష్టి, నేరానికి ప్రేరేపించడం వంటి అభియోగాలపై సిబిఐదర్యాప్తులో స్టేషన్ హౌస్ ఆఫీసర్, శ్రీధర్ ఆదేశా లపై పోలీసులు ఇలాంటి దురాగాతాలకు పాల్పడిందని తేలింది. నిందితులు పైగా ఎవరిలోనూ ఏకోశానా అయ్యో! పాపం అనిగానీ, చచ్చిపోతాడేమోనన్న భయంకాని వారి లో ఏర్పడకపోవడం సభ్యసమాజం విస్తుపోతోంది. ఆ రోజు రాత్రి 8గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు తండ్రీకుమారుడిని కర్రలు, ఇనుపరాడ్లతో చిత్రహిం సలకు గురిచేశారని విచారణలో నిరూపితమైంది. వారిపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుం డా ఫోర్జరీ పత్రాలను సృష్టించారు. లాకప్టెత్ కేసుల్లో ఇంత మంది పోలీసులు ఇద్దరు వ్యక్తుల చావుకు కారణమవడమే ఒక రికార్డు. వారిలో ఏ ఒక్కరికి మానవత్వం లేకపోవడం దురదృష్టకరం. ఒకవేళ తమ ఇన్స్పెక్టర్ ఇలాంటి దురాగతానికి ప్రేరేపించినా ఆపై అధికారులకు తెలియ చేసి వారిమరణానికి దారితీసే చిత్రహింసలను ఆపిఉండ వచ్చునని, అలాకాకుండా ఈ నేరంలో భాగస్వామ్యమైనట్లు భావించి ఈ అరుదైన కేసులో వారంతా శిక్షార్హులేనని కోర్టు విశ్వసించింది. కాస్త ఆలస్యమైనా నేర నిర్ధారణతో మదురై బెంచి వెలువరించిన తీర్పు దేశవ్యాప్త ఉన్న పోలీసు లోకానికే గుణపాఠం కాగలదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

2018 తీర్పును రద్దు చేయాలని సుప్రీంకోర్టులో విన్నపం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha