Actor surya political entry:తమిళ స్టార్ హీరో సూర్య రాజకీయాల్లోకి వస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సూర్య రాజకీయ ప్రవేశం వార్తలకు బలం చేకూర్చేలా ఇటీవల చెన్నైలో జరిగిన సూర్య అఖిల భారత అభిమానుల పరిరక్షణ సంఘం సమావేశం నిలిచింది.
ఆ సమావేశంలో పాల్గొన్న ఆర్. వీరమణి సూర్య కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని వ్యాఖ్యానించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది.
Clarity on Surya’s entry into politics
అసలు జరిగింది ఏంటి?
చెన్నైలో జరిగిన రాష్ట్ర జిల్లా స్థాయి చర్చా సమావేశంలో ఆర్. వీరమణి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సూర్య రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఆయన చెప్పడంతో ఫ్యాన్స్ లో అయోమయం మొదలైంది. ఒక ప్రముఖ హీరో రాజకీయాల్లోకి వస్తే ప్రభావం ఎలా ఉంటుందో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడంతో సూర్య అభిమానుల సంఘం వెంటనే స్పందించాల్సి వచ్చింది.
Actor surya political entry:అభిమానుల సంఘం క్లారిటీ ఇదే
ఆర్. వీరమణి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని అభిమానుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. నటుడు సూర్య రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో లేరని వారు తేల్చి చెప్పారు. ఇప్పటివరకు సూర్య అలాంటి సంకేతాలు ఇవ్వలేదని, అనవసరమైన ఊహలకు తావు ఇవ్వవద్దని కోరారు. దీంతో సూర్య రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
Epaper: epaper.vaartha.com
సమంత రికార్డుల వేట.. రూ.80 కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న 'మా ఇంటి బంగారం'!

