Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజపేటలో అక్రమంగా చెరువు మట్టి తరలింపు

రాజపేటలో అక్రమంగా చెరువు మట్టి తరలింపు

వార్త 3 months ago

Koudipally News: ఫంక్షన్ హాల్ ఎసి కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి గ్రామ పెద్ద చెరువు నుండి ఎలాంటి ప్రభుత్వాలు అనుమతులు పొందకుండా అక్రమంగా మట్టిని తరలించి డంపింగ్ చేసిన సంఘటన కౌడిపల్లి మండల పరిధిలోని రాజపేట గ్రామంలో వెలుగులోకి వచ్చింది గ్రామానికి చెందిన నాగభూషణం పటేల్ గ్రామంలో కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్ట తెలిసి గ్రామానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు నుండి దాదాపుగా 600 ట్రాక్టర్ల మొరమ్మటిని అక్రమంగా తరలించి డంపింగ్ చేశారు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి ప్రభుత్వా ఖజానాకి గండి కొట్టి పెద్ద మొత్తంలో మురమ్మటిని కుప్పలుగా పోసి డంపింగ్ ఏర్పాటు చేశారు.

మండల కార్యానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజపేట గ్రామంలో ఇంత జరుగుతున్న నిద్రావస్థ లో ఇరిగేషన్ శాఖ ఉండిపోయింది

Read also: Telangana Heatwave: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 48 డిగ్రీలకు చేరనున్న ఎండలు!

 Illegal soil transport at Rajapeta

Koudipally News: నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

ప్రభుత్వం గతంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని గాని ఇసుకను గాని తరలిస్తే కేసులు నమోదు చేస్తామని జీవో జారీ చేయగా జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సైతం అక్రమంగా అనుమతులు లేకుండా మట్టి, ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పటికీ సదరు వ్యక్తి ఆదేశాలను బేకాతర్ చేస్తూ తన ఇస్తారాజ్యంగా చెరువులో నుండి మొరమట్టిని తరలించారు నాగభూషణం పటేల్ రాజుపేట గ్రామంలో ఎలాంటి శుభకార్యాలైన, భగవంతుని ఉత్సవాలకు పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తాడు అనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ అతనికి సహకరిస్తున్నారని నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ తెలియజేశారు.

చర్యలు తీసుకునేది ఎవరు?

ఈ విషయమై గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా తన దృష్టికి రాలేదని అక్రమ మట్టి వ్యవహారాన్ని దాటవేశారు. ఏది ఏమైనా వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిస్తే చెరువు నిండినట్లయితే మూగజీవాలకు ప్రాణాపాయం తప్పదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేసి డంపింగ్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సిహెచ్ చేసి వేలంపాట వేస్తుంది మరి అక్రమంగా అనుమతులు లేకుండా చెరువులో నుండి మొరమట్టిని తరలించి డంపింగ్ ఏర్పాటుచేసిన వాటిని ప్రభుత్వం సీజ్ చేసి వేలం వేస్తుందా లేదా ప్రభుత్వం జరిమానా విధిస్తుందా లేదా?. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అక్రమంగా మట్టి తరలించిన వ్యక్తి పైన ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే సుమ.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బండి భగీరథ్‌ దేశం దాటకూడదు: పోలీసులకు కవిత విజ్ఞప్తి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha