Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజస్థాన్‌లో రైల్వే మార్గంపై పేలుడు అనుమానాలు!

రాజస్థాన్‌లో రైల్వే మార్గంపై పేలుడు అనుమానాలు!

వార్త 2 weeks ago

Rajasthan Train Track Blast: రాజస్థాన్‌లో రైలు మార్గం సమీపంలో చోటుచేసుకున్న అనుమానాస్పద పేలుడు ఘటన కలకలం రేపింది. అనుప్‌గఢ్‌-సూరత్‌గఢ్‌ రైల్వే మార్గంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

50 జీబీ గ్రామం సమీపంలో రైలు మార్గానికి ఆధారంగా ఉన్న రెండు సిమెంట్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. దీంతో వాటిలోని ఉక్కు కడ్డీలు బయటకు కనిపించాయి. రైల్వే మార్గాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే పేలుడు జరిపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనకు పేలుడే కారణమని పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు. స్తంభాలు ధ్వంసం కావడానికి పేలుడు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also :Bhadradri Kothgudem: బస్సు టైర్ల కింద పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కండక్టర్ ప్రవళిక మృతి

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

ఘటన గురించి సమాచారం అందుకున్న శ్రీగంగానగర్‌ ఎస్పీ హరిశంకర్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) బృందాన్ని అక్కడికి రప్పించినట్లు తెలిపారు. నిపుణులు ఘటనా స్థలంలో పరిశీలనలు జరుపుతూ కీలక ఆధారాలను సేకరిస్తున్నారని వెల్లడించారు.

Rajasthan Train Track Blast: పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తు

రైల్వే మార్గానికి సమీపంలో సిమెంట్ స్తంభాలు ధ్వంసం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఘటన వెనుక అసలు కారణం ఏమిటన్నది ఫోరెన్సిక్ నివేదిక, పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

వికారాబాద్ జిల్లాలో విషాదం.. మైనింగ్ గుంతలో పడి ఇద్దరు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha