Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజీనామా చేస్తా అంటూ అసెంబ్లీ లో హెచ్చరించిన BJP ఎమ్మెల్యే

రాజీనామా చేస్తా అంటూ అసెంబ్లీ లో హెచ్చరించిన BJP ఎమ్మెల్యే

వార్త 2 weeks ago

Telangana Assembly : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

తన నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయన సభాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి నిధులన్నీ కేవలం ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్, మంత్రి సీతక్క నియోజకవర్గమైన ములుగుకే తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఎంతగా విన్నవించినా పాలకుల నుండి ఎలాంటి స్పందన లేదని, పరిస్థితి ఇలాగే ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని సభలో బహిరంగంగా హెచ్చరించారు.

నవ్వుల్లో మునిగిపోయిన సభ – స్పీకర్ సముదాయించే యత్నం

సభ ముగిసే సమయంలో తనకు మాట్లాడేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని రాకేష్ రెడ్డి స్పీకర్‌ను కోరారు. “అధ్యక్షా, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇవాళే రాజీనామా చేయాలనుకుంటున్నా” అని ఆయన తనదైన శైలిలో కామెంట్ చేయడంతో ఒక్కసారిగా సభలోని వాతావరణం మారిపోయింది. ఆయన శైలికి స్పీకర్‌తో పాటు వేదికపై ఉన్న మంత్రులు, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ నవ్వులు చిందించారు. అయితే, ఆయన లేవనెత్తిన ప్రాంతీయ అసమానతల అంశం రాజకీయం వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సన్న వడ్ల రైతులకు గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha