Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజీనామా చేయమని ఎవరూ అడగలేదు.. స్పష్టం చేసిన కొండా సురేఖ

రాజీనామా చేయమని ఎవరూ అడగలేదు.. స్పష్టం చేసిన కొండా సురేఖ

వార్త 2 weeks ago

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో తన రాజీనామాపై జరుగుతున్న ప్రచారంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని అధిష్ఠానం లేదా మరెవరూ కోరలేదని ఆమె మీడియా సమక్షంలో స్పష్టం చేశారు.

Read Also : Konda surekha dismissal: దిల్లీ పెద్దల జోక్యంతో కొండా సురేఖ పదవి గల్లంతు?

 No one asked me to resign, clarifies Konda Surekha.

Konda Surekha: కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై వ్యాఖ్యలు

తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన రాజకీయ వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని సురేఖ తెలిపారు. కుమార్తె సొంత అభిప్రాయాలతో మాట్లాడిందని, ఆమె వ్యాఖ్యలను ఖండించే అధికారం తమకు లేదని వివరించారు. సమాజంలో 100 మంది రకరకాల విమర్శలు చేస్తుంటారని, బయటి వ్యక్తులు మాట్లాడినప్పుడు కుటుంబ సభ్యులను బాధ్యులను చేయడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అనే అంశంపై తాను ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సురేఖ వెల్లడించారు. ఈ విషయంలో కుటుంబ సభ్యులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే తన భవిష్యత్ రాజకీయ అడుగులపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.

బర్తరఫ్‌ ను తీవ్రంగా ఖండిస్తున్నా: కొండా సురేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha