Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజీనామా ర్యాలీతో హీట్ పెంచిన కాంగ్రెస్. బిఆర్ఎస్‌కు సవాల్ విసిరిన నరేందర్ రెడ్డి!

రాజీనామా ర్యాలీతో హీట్ పెంచిన కాంగ్రెస్. బిఆర్ఎస్‌కు సవాల్ విసిరిన నరేందర్ రెడ్డి!

వార్త 1 month ago

Congress Resignation Rally: గుమ్మడిదల మున్సిపాలిటీ 13వ వార్డులో రాజకీయ వేడి ఒక్కసారిగా ఎగిసిపడింది.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట నర్సింగరావు ఆధ్వర్యంలో కౌన్సిలర్ మూడు చింతల నరేందర్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేలా దూసుకెళ్లాయి.

నినాదాలతో గుమ్మడిదల వీధులు మారుమోగగా, రాజకీయంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

Read Also : BRS Formation Day: కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్‌ తోనే తెలంగాణ సాధన

Congress Resignation Rally: రాజీనామా సమర్పణ, బిఆర్ఎస్‌కు సవాల్

మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న నరేందర్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బిఆర్ఎస్‌పై ఘాటుగా విరుచుకుపడ్డారు. "మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం… కానీ బిఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడ? పోటీకి సిద్ధమైతే ముందుకు రావాలి" అంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

రాజకీయ ఉత్కంఠ

బిఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు స్పష్టమైన స్పందన ఇవ్వకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి పరీక్ష అని, బిఆర్ఎస్ ధైర్యం ఉంటే పోటీకి రావాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు, రాజీనామా రగడతో గుమ్మడిదల మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల నిఘా మధ్య ఉద్రిక్తత పెరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన బీర్ల విక్రయాలు.. ఒక్క నెలలోనే అన్ని కోట్ల అమ్మకాలా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha