Telangana High Court: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
ఈ ప్రాజెక్టు నిర్మాణ నిమిత్తం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. భూసేకరణ కోసం ప్రభుత్వం జారీచేసిన డిక్లరేషన్ నోటీసుల అమలుపై స్టే విధించడంతో పాటు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ప్రాజెక్టు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉండగానే నోటిఫికేషన్లు జారీ
న్యాయస్థానం ఆదేశాలు అమల్లో ఉన్న సమయంలోనే భూసేకరణకు సంబంధించిన డిక్లరేషన్ మరియు గెజిట్ నోటిఫికేషన్‌లను జారీచేశారంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, గతంలో ఇదే వివాదాస్పద అంశంపై జారీచేసిన ‘స్టేటస్‌కో’ (యథాస్థితి) ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Telangana High Court: ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తితో గడువు పెంపు
ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫున హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్టును కొంత సమయం కోరారు. ప్రభుత్వ వాదనలు, కౌంటర్ దాఖలుకు సంబంధించి తగిన గడువు ఇవ్వాలని కోరడంతో, తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. కోర్టు నిర్ణయంతో ప్రస్తుతానికి భూసేకరణ ప్రక్రియకు తాత్కాలిక అడ్డుకట్ట పడినట్లయింది.
Epaper: epaper.vaartha.com

