Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్

రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్

వార్త 2 weeks ago

Director Saailu Kampati Next Movie: ఎమోషనల్ లవ్ కంటెంట్‌తో వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు సాయిలు కంపాటి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా, సాయిలు మేకింగ్ స్టైల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. తన మొదటి చిత్రంతోనే విజయం అందుకున్న ఆయన, ఇప్పుడు టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు.

Read Also:Nithin New Movie: నితిన్ కొత్త సినిమా ప్రారంభం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో క్రేజీ ప్రాజెక్ట్

ఆసియన్ గ్రూప్స్ నిర్మాణంలో క్రేజీ కాంబినేషన్

సాయిలు కంపాటి తర్వాతి సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఆసియన్ గ్రూప్స్ నిర్మించేందుకు ముందుకు రావడం విశేషం. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఉన్న ఆసియన్ గ్రూప్స్, సాయిలు మేకింగ్ పై నమ్మకంతో ఈ భారీ సినిమాను నిర్మిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 Saailu Kampati Next Movie

Director Saailu Kampati Next Movie: టాలీవుడ్‌లో పెరిగిన అంచనాలు

మొదటి సినిమాతో ఎమోషనల్ కంటెంట్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేసిన సాయిలు, ఈసారి ఆసియన్ గ్రూప్స్ వంటి పెద్ద బ్యానర్‌లో ఎలాంటి కథను తీసుకురాబోతున్నారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.సాయిలు కంపాటి(Saailu Kampati) దర్శకత్వంలో శ్రీసింహా నటించబోయే ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైనర్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha