పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్(Harivansh Narayan) మరోసారి ఎన్నికయ్యారు. హరివంశ్ వరుసగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక పదవికి ఎంపిక కావడం విశేషం.
ఈ సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Read Also: Delimitation: డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ భరోసా: "విభజన రాజకీయాలు వద్దు.. దేశాభివృద్ధే ముఖ్యం!"
Harivansh Narayan: Harivansh Narayan elected as Deputy Chairman of Rajya Sabha
సభకు పెద్ద ఆస్తి
హరివంశ్ ఎన్నిక అనంతరం సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆయనకున్న అపారమైన అనుభవం పెద్దల సభ హుందాతనాన్ని మరింత పెంచుతుందని కొనియాడారు. “హరివంశ్ నారాయణ్ గారికి చట్టసభల్లో ఎంతో అనుభవం ఉంది. ఆయన పనితీరు, నిష్పాక్షికత సభ సజావుగా సాగడానికి ఎంతో దోహదపడతాయి” అని మోదీ పేర్కొన్నారు. గత రెండు పర్యాయాల్లోనూ ఆయన సభను సమర్థవంతంగా నడిపించారని, ఈ మూడో ఇన్నింగ్స్‌లో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
డీలిమిటేషన్ అప్‌డేట్.. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు ఇవే!

