Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామ్ చరణ్ 'పెద్ది'లో సంయుక్త మీనన్ స్పెషల్ సాంగ్!

రామ్ చరణ్ 'పెద్ది'లో సంయుక్త మీనన్ స్పెషల్ సాంగ్!

వార్త 2 months ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో హైలైట్ కాబోయే స్పెషల్ సాంగ్ విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది.ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్, మానసా వారణాసి వంటి పేర్లు వినిపించినప్పటికీ, చివరికి సంయుక్త మీనన్ ఖరారైనట్లు సమాచారం.

Read Also:Tirumala: శ్రీవారిని దర్శించుకున్న నటి తమన్నా

Samyuktha Menon: 'పెద్ది' స్పెషల్ సాంగ్ విశేషాలు

ఇటీవల ల అఖండ 2: తాండవం( Akhanda 2: Tandavam)లో "జాజికాయ జాజికాయ" పాటతో మాస్ స్టెప్పులు వేసిన సంయుక్తకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే ఎనర్జీతో రామ్ చరణ్‌తో కలిసి స్టేజ్ షేక్ చేయనుందన్న టాక్ వినిపిస్తోంది.సంయుక్త ఇప్పటికే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌తో పాటు డ్యాన్స్‌లోనూ మంచి టాలెంట్ చూపించిన ఆమెకు ఈ స్పెషల్ సాంగ్ మంచి ప్లస్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రామ్ చరణ్ ఎనర్జీ, సంయుక్త స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే ఈ పాట సినిమా హైలైట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న 'పెద్ది' చిత్రానికి సానా బుచ్చిబాబు దర్శకుడు. 'ఉప్పెన' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తమ్ముడి ఆరోగ్యంపై చిరంజీవి ఎమోషనల్ అప్ డేట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha