Dailyhunt
శ్రీవారిని దర్శించుకున్న నటి తమన్నా

శ్రీవారిని దర్శించుకున్న నటి తమన్నా

వార్త 2 weeks ago

Tirumala: ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న ఆమె, సామాన్య భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ వెలుపల అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలను తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Read Also:Deepika Padukone: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా.. దువాతో కలిసి క్రేజీగా ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్

 Tamannaah Bhatia Tirumala visit

Tirumala: తమన్నా నెక్స్ట్ మూవీ: ‘వ్వాన్’ (Vvan)

ఇక సినిమాల విషయానికొస్తే, తమన్నా తదుపరి చిత్రం 'వ్వాన్' (Vvan)లో నటించబోతున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, దీపక్ మిశ్రా మరియు అరుణాభ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రక్షా బంధన్ కానుకగా ఈ ఏడాది ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నా మాటలను వక్రీకరించారు.. శ్రీరాముడి వ్యాఖ్యల వివాదంపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha