Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామ్ చరణ్ సర్జరీ సక్సెస్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్

రామ్ చరణ్ సర్జరీ సక్సెస్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్

వార్త 3 months ago

Ram Charan Health Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన తాజా చిత్రం 'పెద్ది' (Peddi) షూటింగ్ సెట్‌లో ప్రమాదానికి గురయ్యారు. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన కంటికి గాయం కావడం, తదనంతరం సర్జరీ జరగడం మెగా అభిమానుల్లో ఆందోళన కలిగించింది.

Read Also:NBK Lifetime Achievement Award: బాలయ్యకు అరుదైన గౌరవం

రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్ లో, గాయపడిన విషయం తెలిసిందే. ఆయన కంటికి చిన్న సర్జరీ జరిగినట్లు చిరంజీవి సోషల్ మీడియాలో వెల్లడించారు. చరణ్ కు, సర్జరీ చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్ కు, ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.సర్జరీ గురించి చిరంజీవి స్పందిస్తూ.. “చరణ్ కనురెప్పకు మీరు సరైన సమయంలో, ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. మొదట మాకు కొంత ఆందోళన కలిగినప్పటికీ, మీ మాటలు భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిచ్చాయి” అని పేర్కొన్నారు. డాక్టర్ వృత్తి నైపుణ్యం తమకెంతో ఊరటనిచ్చిందని, తమ కుటుంబం ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని చిరంజీవి తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Ram Charan Health Update: సినిమా వివరాలు..

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమా గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో ఉన్నారు. సంగీతం ఏ. ఆర్. రహ్మాన్ అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు వ్రిధ్ధి సినిమా బ్యాక్ చేస్తోంది. 'పెద్ది' మూవీ మొదట మార్చి 27న రిలీజ్ ప్లాన్ చేశారు, కానీ మేకర్స్ కొత్తగా ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఏఐ మార్ఫింగ్ ఫోటోపై ఆదిత్య ధర్ స్పందన: "అది మా సినిమా సీన్ కాదు"

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha