Yash: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'రామాయణ' ఒకటి. ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో యశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Yellamma : 'ఎల్లమ్మ' వచ్చేది అప్పుడే !!
తెలుగు ప్రేక్షకుల ప్రేమకు యశ్ ధన్యవాదాలు
ప్రీ రిలీజ్ వేడుకలో హీరో యశ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రేక్షకులను అలరించేందుకు తామంతా ఎంతో కష్టపడుతున్నామని, భారతీయ సినిమా స్థాయిని పెంచడంలో రాజమౌళి, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారి సినిమాలు భారతీయ చిత్ర పరిశ్రమలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాయని అన్నారు. అలాగే నిర్మాత దిల్ రాజుతో తనకు ఇది మూడో కలయిక అని, మంచి సినిమా తెరకెక్కించాలంటే నిర్మాతకు కథపై ప్యాషన్ ఉండాలని, ఆ విషయంలో దిల్ రాజు ముందుంటారని ప్రశంసించారు.

సాయి పల్లవి, రణ్‌బీర్‌పై ప్రశంసలు
ఈ సినిమాలో నటిస్తున్న సహనటుల గురించి కూడా యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శూర్పణఖ పాత్రలో నటించడం అంత సులభం కాదని, ఆ పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ పోషించారని పేర్కొన్నారు. ఇక సీత పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించారని ప్రశంసించారు. అలాగే రణ్‌బీర్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, ఎలాంటి అహంకారం లేని నటుడని యశ్ తెలిపారు. ఇప్పటికే విభిన్న పాత్రలతో తన ప్రతిభను నిరూపించుకున్న రణ్‌బీర్.. రాముడి పాత్రతోనూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారని అభిప్రాయపడ్డారు.
భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం
ఇక దర్శకుడు నితేశ్ తివారీ పనితీరును ప్రశంసిస్తూ, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని యశ్ అన్నారు. అలాగే నిర్మాత నమిత్ మల్హోత్రాకు భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనే బలమైన సంకల్పం ఉందని, సినిమా పట్ల ఆయనకు ఉన్న అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని యశ్ తెలిపారు. అందుకే రావణుడి పాత్రలో నటించడంతో పాటు, ఈ ప్రాజెక్టులో నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
రామాయణ' చిత్రానికి ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ లభించాలని యశ్ ఆకాంక్షించారు. అలాగే తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమల ప్రేక్షకులు ఒకే వేదికపైకి వచ్చి భారతీయ సినిమాకు మద్దతు ఇవ్వాలని కోరారు.
https://vaartha.com/entertainment/hyderabad-is-the-place-that-made-my-dream-come-true-rakul/793535/

