Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాంగ్ కాల్ లవ్ స్టోరీ: ప్రియుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి!

రాంగ్ కాల్ లవ్ స్టోరీ: ప్రియుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి!

వార్త 2 weeks ago

Chittoor Crime: చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో తీవ్ర సంచలనం సృష్టించే ఘటన వెలుగుచూసింది. ప్రియుడిపై ఉన్న మోజుతో ఎనిమిదేళ్ల వివాహ బంధాన్ని, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఇద్దరు కన్న పిల్లలను వదిలేసి, ఒక మహిళ ప్రియుడితో కలిసి పరారై పెళ్లి చేసుకుంది.

మొదట భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసినప్పటికీ, చివరికి పారిపోయి వేరే కాపురం పెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read Also:Saikrishna case: రక్తపు మరకలపై సీఐ నాగరాజును ప్రశ్నించిన సిట్‌ అధికారులు

రాంగ్ కాల్‌తో మొదలై.. ఇన్‌స్టాగ్రామ్‌లో చిగురించిన ప్రేమ!

గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తికి 8 ఏళ్ల క్రితం శోభ (27) అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం క్రితం శోభకు గుంటూరు జిల్లా కండ్రిగకు చెందిన బాలాజీ నాయక్ (22) అనే యువకుడితో రాంగ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇన్‌స్టాగ్రామ్‌ చాటింగ్‌లు, వీడియో కాల్స్‌తో మరింత బలపడి, వారిద్దరి మధ్య తీవ్రమైన ప్రేమకు దారితీసింది.

భర్త హత్యకు స్కెచ్.. ఆపై ప్లాన్ చేంజ్!

ప్రియుడితో ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసిన భర్త చిరంజీవి ఆమెను ప్రశ్నించడమే కాకుండా ప్రతిరోజూ కొట్టడం ప్రారంభించాడు. దీంతో భర్త వేధింపులు తాళలేక, అతన్ని శాశ్వతంగా వదిలించుకోవడానికి భర్తను హత్య చేసేందుకు మొదట స్కెచ్ వేసింది. ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందామని ప్రియుడికి ప్రతిపాదించింది. అయితే, చివరి క్షణంలో మనసు మార్చుకుని హత్య ఆలోచనను విరమించుకుని, నెల రోజుల క్రితం ఇల్లు వదిలి పారిపోయింది. అనంతరం వారిద్దరూ కుప్పంలోని ఒక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

డ్రామా తిరగబడింది: పట్టుకున్న బంధువులు!

భార్య శోభ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన భర్త చిరంజీవి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగానే, శోభ తన ప్రియుడితో కలిసి బెగ్గిలిపల్లిలో రహస్యంగా కాపురం పెట్టినట్లు భర్త బంధువులకు తెలిసింది. వెంటనే అక్కడికి చేరుకున్న బంధువులు వారిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Chittoor Crime: ఇద్దరి విచిత్ర వాదనలు: పోలీసులు హడల్!

పోలీస్ స్టేషన్‌లో విచారణ సందర్భంగా ఇరువైపులా విచిత్రమైన వ్యాఖ్యలు వినిపించడంతో పోలీసులు సైతం తలలు పట్టుకున్నారు:

ప్రియుడు బాలాజీ నాయక్ వాదన

శోభ నన్ను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆమె ఒత్తిడి, బలవంతం తట్టుకోలేకే నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

భార్య శోభ వాదన

“నా భర్త రోజూ అనుమానంతో నన్ను దారుణంగా వేధించేవాడు. నా ఒంటిపై ఉన్న దెబ్బలు చూసి బాలాజీయే నా భర్తను చంపుతానని అన్నాడు. కానీ వద్దని వారించి, మేమే పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం.” ప్రస్తుతం ఈ కేసు విషయమై ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇస్తూ, తగిన న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Epaper: epaper.vaartha.com

అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ షీలు బల్హారా భార్య ముస్కాన్ ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha